మనసున్న మారాజు...సీఎం కేసీఆర్‌

Sun,June 16, 2019 01:55 AM

-అధికారులు సహకరిస్తే స్వర్ణయుగం వస్తది..
-కళ్యాణలక్ష్మీ చెక్కులు, పట్టాపుస్తకాల పంపిణీ
-అధికారులకు ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ దిశానిర్ధేశం
కురవి, జూన్‌ 15 : బంగారు తెలంగాణేధ్యేయంగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్‌ మనసున్న మారాజు అని, ఆయన తీసుకువచ్చిన ప్రతీ పథకానికి ఓ ప్రత్యేకత ఉందని డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌ అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో డోర్నకల్‌, కురవి మండలాల కల్యాణలక్ష్మి చెక్కులు, రైతుల కొత్త పాసుపుస్తకాలను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌ అధికారులకు దిశానిర్ధేశం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. అధికార యంత్రాంగం శ్రద్ధతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ప్రతీ పేదింటి మేనమామలా సీఎం కేసీఆర్‌ తెచ్చిన కల్యాణలక్ష్మి పథకం ఆడ పిల్ల తల్లిదండ్రులకు కష్టం కాకుడదనే తీసుకొచ్చిన పథకమన్నారు.

ఈ చెక్కుల పంపిణీలో అలస్యం చేయొద్దని సూచించారు. పాసుపుస్తకాల విషయంలో రెవెన్యూ అధికారులు అలసత్వం వీడాలన్నారు. కొందరు వీఆర్‌వోలకు పరిజ్ఞానం లేక, మరికొందరికి ఉన్నా ఎందుకు త్వరగా చేయాలనే తాత్సారం చేస్తున్నారని, వెంటనే పనులు పూర్తి చేసి పనులు తగ్గించుకోవాలని సూచించారు. ఆర్డీవో, తహసీల్దార్‌లు ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కురవి మండలంలో 52 కల్యాణలక్ష్మి చెక్కులు, 418 కొత్త పాసుపుస్తకాలను అందజేశారు. డోర్నకల్‌లో 86 కల్యాణలక్ష్మి చెక్కులు, 109 పాసుపుస్తకాలను రెడ్యానాయక్‌ లబ్ధిదారులకు, రైతులకు అందచేశారు. మరో 153 కల్యాణలక్ష్మి చెక్కులు పెండింగ్‌లో ఉన్నాయని, అధికారులు త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశిం చారు. ఈ నెల 29వ తేదీన ప్రతీ మండలానికి ఒక రోజు చొప్పున పట్టా పుస్తకాల గురించి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేయనున్నట్లు చెప్పారు.

కాళేశ్వరం నీటితో సస్యశ్యామలం
సీఎం కేసీఆర్‌ అపరభగీరథుడని, రైతు పక్షపాతి అని కొనియాడారు. ప్రతీ పథకంలో రైతుకు లబ్ధి చేకూరుతుందని గుర్తుచేశారు. ఈనెల 21వ తేదీన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులతో కలిసి సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభిస్తాడన్నారు. ఎస్సారెస్పీ కాల్వల ద్వారా ఆ నీరు మన నియోజకవర్గానికి చేరితే సస్యశ్యామలమవుతుందన్నారు. సీఎం కేసీఆర్‌ తీసుకువచ్చిన పథకాలను 29రాష్ట్రాలు అనుసరిస్తున్నాయన్నారు.

మరోపార్టీకి అవకాశం ఉండదు
పార్టీలకు అతీతంగా ప్రతీ గడపకు సంక్షేమాన్ని అందిస్తూ ప్రజారంజక పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్‌ను రెండో అత్యధిక మెజార్టీతో ఏకపక్షంగా ప్రజలు విజయం అందించారని రెడ్యానాయక్‌ అన్నారు. 24గంటల కరంటు, కాళేశ్వరంతో సాగునీరు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, రైతు బంధు, రైతు బీమా, ఇంటింటికి కేసీఆర్‌ తాగు నీరు, పుట్టిన బిడ్డకు కేసీఆర్‌ కిట్‌ ఈ పథకాలతో మళ్లీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే వస్తుందని జోస్యం చెప్పారు. ప్రజలు ఎంతో విజ్ఞులని, హంసలాంటివారని ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ అన్నారు. వారికి పనిచేసేవారు తెలుసని అందుకు నిదర్శణం తాను ఆరుపర్యాయాలు గెలవడమేనన్నారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులను గెలిపించారని, గెలిచన అభ్యర్థులు తాము పోటీ చేసిన గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి పేరుతెచ్చుకోవాలన్నారు. సూచించారు.

కురవి ఎంపీపీ బజ్జూరి ఉమాపిచ్చిరెడ్డి అధ్యక్షతన జరిగిన పంపిణీ కార్యక్రమంలో కురవి, డోర్నకల్‌ తహసీల్దార్లు శ్రీనివాస్‌, నర్సింహారావు, ఎంపీడీవో కె ధన్‌సింగ్‌, ఓడీసీఎంఎస్‌ చైర్మన్‌ నూకల వేణుగోపాల్‌రెడ్డి, జెడ్పీటీసీ కొణతం కవిత విజయ్‌, డోర్నకల్‌ ఎంపీపీ మేకపోతుల రమ్యశ్రీనివాస్‌, జెడ్పీటీసీ స్వరూపకోటిలింగం, తాజా జెడ్పీటీసీ వెంకట్‌రెడ్డి, మండల అధ్యక్షుడు లాలయ్య, రవి, మరిపెడ కోఆప్షన్‌ సభ్యుడు ఎండీ అయూబ్‌ పాషా, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్‌ రమేశ్‌, వైస్‌ ఎంపీపీ వెంకన్నగౌడ్‌, ఆలయ చైర్మన్‌ శ్రీనివాస్‌, ఎర్రనాగేశ్వర్‌రావు, నర్సింహారావు, బోజ్యానాయక్‌, సురేందర్‌రెడ్డి, భాస్కర్‌, రాంలాల్‌, సైదులు, పోరెడ్డి రాంరెడ్డి, పాల్గొన్నారు.

79
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles