సర్కారీ పాఠశాలల్లోనే మెరుగైన విధ్యభోదన

Sun,June 16, 2019 01:53 AM

- డీఈవో సత్యప్రియ
బయ్యారం, జూన్‌ 15 : ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య భోధన జరుగుతుందని డీఈవో సత్యప్రియ అన్నారు. శనివారం జయశంకర్‌సార్‌ బడిబాట సందర్బంగా మండలం కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయంలో ఎస్‌వో కల్పణదేవి అద్యక్షతన బాలిక విద్య పై ఆవగాహణ సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమే మాట్లాడుతూ... బాలికలు అన్ని రంగాల్లో ముందుండాలని కోరారు. గతంలో వటింటికే పరిమితం అయిన మహిళలు నేడు అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారని తెలిపారు. అదేవిథంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్ధుల కోసం ప్రభుత్వం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తుందని అన్నారు. వారి కోసం అనేఖ నూతన పథకాలను ప్రవేశపెడుతుందని తెలిపారు. విద్యార్థులకు ఉచితంగా పుస్తాకాలు, దుస్తులు, మధ్యాహ్నా భోజనం అందజేస్తుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాన్యత గల భోజనం అందించాలనే లక్ష్యంతో సన్న బియంతో మధ్యాహ్నా భోజనం అందిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం కార్పోరెటు స్థాయిలో తీర్చి దిద్దుతుందని అన్నారు. ఉపాధ్యాయులు సైతం అంఖిత భావంతో పని చేసి పాఠశాలల అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. తల్లితండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుగులోత్‌ జయశ్రీ, ఎంపీడీవో వెంకటపతిరాజు, ఎంఈవో పుల్‌చంద్‌, హెచ్‌ఎం విజయలక్ష్మీ,దెవేంద్రచారి తదితరులు పాల్గోన్నారు.

81
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles