చేపల చెరువు లూటీ...

Sun,June 16, 2019 01:53 AM

-ఒక్కరోజు అవకాశం ఇవ్వాలని మత్స్యకారుల వేడుకోలు
-పోలీసులు వచ్చిన ఫలితం శూన్యం
-స్పృహ తప్పిన మత్స్యకార్మికులు
కురవి, జూన్‌ 15: మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం కాంపల్లి గ్రామ పెద్దచెరువు శనివారం జనంతో నిండిపోయింది. చెరువు నిండా చేపలు ఉన్నాయని మత్స్య కారులు వారించిన లూటీ జరిగింది. వందలాదిమంది జనం చిన్నపెద్ద తారతమ్యం, ఆడ మగ తేడా లేకుండా చుట్టుపక్కల తండాలు, గ్రామాలు ఒక్కసారిగా చెరువుపై పడ్డాయి. చెరువు జనసంద్రంగా మారిపోయింది. చీరలు..వలలు వెంట తెచ్చుకున్న జనం కిలోలకొద్ది చేపలను పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మత్స్య కారుల అభివృద్ధికై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీతో కూడిన చేపపిల్లలను చెరువుల్లో, కుంటల్లో వదులుతుంది. అవి పెరిగిన తరువాత వాటిని విక్రయించి వచ్చే లాభాలతో మత్స్య కారులకు లాభాలు చేకూరాలని ఉద్ధేశ్యం. గత సంవత్సరం చేపలు పోసిన మత్సకారులు సంవత్సరం పాటు కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఆ చెరువులోని చేపలను కాంపల్లి గ్రామానికి చెందిన బయ్యనాగేందర్‌ వేలంపాట పాడాడు. గత వారం రోజుల క్రితమే చేపలను పట్టాల్సి ఉండగా నాగేందర్‌ భార్య రాములమ్మకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆస్పత్రికి తీసుకువెల్లి రెండు రోజుల క్రితమే వచ్చాడు. శనివారం చేపలు పట్టేందుకు కూలీలతో వెల్లిన నాగేందర్‌కు అక్కడ జనం ఉండడంతో ఒక్కసారిగా హతశుడయ్యాడు. విషయం తెలిసిన భార్య రాములమ్మ ఆరోగ్య పరిస్థితులను లెక్కచేయకుండా చెరువు వద్దకు వచ్చి చేపలకోసం వచ్చిన జనాన్ని కాళ్లవేళ్ల పడి వేడుకున్నా ఎవరు కనికరించలేదు. దీంతో పరిస్థితి విషమిస్తుందనుకునే సమయంలో సమాచారం అందుకున్న సీరోలు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దేందుకు యత్నించారు. అయిన ఫలితం లేకపోవడంతో పోలీసులు చేతులెత్తేసారు. సదరు పాట పాడిన వ్యక్తి నాగేందర్‌, భార్య రాములమ్మలు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ సొమ్మసిల్లి పడిపోయారు.

62
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles