కంబాలపల్లిలో చక్రి జయంతి

Sun,June 16, 2019 01:53 AM

మహబూబాబాద్‌ రూరల్‌,జూన్‌ 15 :సంగీత దర్శకుడు చక్రి సొంత గ్రామం కంబాలపల్లిలో శనివారం మిత్ర బృందం ఆధ్వర్యంలో జయంతి వేడుకలను నిర్వహించి,విగ్రహానికి పూల మాల వేసి నివాళ్ళు అర్పించారు. ఈసందర్భవగా యూత్‌ సంఘం ఆధ్వర్యంలో వారు మాట్లాడుతూ చక్రి అనేక చిత్రాలకు సంగీతం అందించి ఎంతోమంది ప్రేక్షకుల మన్ననలను పొందారని అన్నారు.స్నేహితులకు ఎంతో విలువ ఇచ్చేవారని ఎంత పని ఒత్తిడి ఉన్న స్నేహితులతో కలిసి గడపటానికి ప్రాధాన్యత ఇచ్చేవారని అన్నారు. పాఠశాలలో పిల్లలకు నోట్‌ బుక్స్‌ అంద చేశారు.ఈకార్యక్రమంలో ఎంపీటీసీ యర్రంరెడ్డి సరస్వతీ,వెంకటరెడ్డి,రాధాకృష్ణ,యశ్వంత్‌,గణేష్‌,ఐలయ్య,వెంకటనారాయణ పాల్గొన్నారు.
రెడ్యాలలో చక్రి జయంతి వేడుకలు
మండల పరిదిలోని రెడ్యాల గ్రామంలో శనివారం చక్రి మిత్ర మండలి ఆద్వర్యంలో సినీ సంగీత దర్శకుడు చక్రి జయంతి వేడుకలను నిర్వహించారు.కొత్త రెడ్యాల ప్రాధమిక పాఠశాలలో ఒకటి నుండి ఏడు వరకు చదువు విద్యార్దులకు నోట్‌ పుస్తకాలను,పెన్నులను,పెన్సిలను ఈసంవత్సరం ప్రతిభ కనబరిచిన విద్యార్దులుకు నగదు బహుమతులను అందచేశారు. ఈకార్యక్రమంలో తెలంగాణ కనీస వేతన సలహా సంఘం ఛైర్మన్‌ సామ వెంకటరెడ్డి, లక్ష్మారెడ్డి,రాములు,పాఠశాల ఉపాధ్యాయులు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

71
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles