మీడియా అక్రిడిటేషన్‌ కార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

Sun,June 16, 2019 01:52 AM

-మహబూబాబాద్‌, నమస్తే తెలంగాణ, జూన్‌ 15ః
మీడియా అక్రిడిటేషన్‌ కార్డుల కోసం అర్హత గల జర్నలిస్టులు ఈనెల 18వ తేదీ నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సిహెచ్‌. శివలింగయ్య ఒక ప్రకటనలో తెలిపారు. 2019-20 సంవత్సరానికి గాను జిల్లాలో పనిచేస్తున్న మీడియా ప్రతినిదులకు అక్రిడిటేషన్‌ కార్డుల జారీ చేయుటకు రాష్ట్ర పౌరసంబంధాల శాఖ కమీషనర్‌ ఆదేశాల మేరకు జిఓ ఎంఎస్‌నెంబర్‌ 239 ప్రకారం అక్రిడిటేషన్‌లు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. వివిధ మీడియా సంస్థల ప్రతినిధులు వారి యాజమాన్యాల సిఫారసు లెటర్లను ఈనెల 20వ తేదీలోగా జిల్లా పౌరసంబంధాల అధికారి మహబూబాబాద్‌ కార్యాలయంలో అందజేయాలని అన్నారు. ఆయా యాజమాన్యాల లేఖ జాబితాలో పేర్లు ఉన్న వారు మాత్రమే ఈనెల 18వ తేదీ నుండి సంబంధిత పత్రాలతో http://ipr. telangana. gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఈ నెల 24వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్‌ కోరారు.

64
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles