ఆబోతు ముత్తయ్య, లబ్ధిదారుడు, తొర్రూరు

Sat,June 15, 2019 02:41 AM

-కాళేశ్వరం తరలిన గుండంరాజుపల్లి గ్రామస్తులు
చిన్నగూడూరు జూన్‌ 14 : మండలంలోని గుడుంరాజుపల్లి గ్రామస్తులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు శుక్రవారం టీఆర్‌ఎస్‌ మండల ప్రధానకార్యదర్శి మూల మురళీదర్‌రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 180 మంది కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మురళీధర్‌రెడ్డి మాట్లాడారు. వేలకోట్ల రూపాయలతో సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పనులు పూర్తి అయితే తాగు, సాగు నీటి సమస్యలకు శాస్వత పరిష్కారం లభిస్తుందని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో తెలంగాణ సస్యశ్మాలం కావడం ఖాయమన్నారు. దీంతో సీఎం కేసీఆర్‌ పేరు చరిత్రలో చిర స్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఇంతటి మహత్తర ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్న సీఎం కేసీఆర్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాళేశ్వరం తరలిన వారిలో స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు,గ్రామస్తులు ఉన్నారు.

64
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles