డోర్నకల్‌ ఈజీఎస్‌ ఏపీవో సస్పెన్షన్‌

Sat,June 15, 2019 02:40 AM

కురవి(డోర్నకల్‌), జూన్‌ 14: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కాంట్రాక్ట్‌ పద్ధతిన విధులు నిర్వర్తిస్తున్న ఏపీవో కే మాధవిని సస్పెండ్‌ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన హరితహారం మొక్కల పెంపకంపై జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ శివలింగయ్య గొల్లచర్లలో తనిఖీ చేస్తున్న సమయంలో ఏపీవో నిర్లక్ష్యాన్ని మొదటితప్పుగా భావించి మందలించారు. అయినా మాధవి తీరు మార్చుకో లేదు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఈనెల 7న డీఆర్డీఏ పీడీ మండలంలోని పలు నర్సరీలను తనిఖీ చేస్తున్న సమయంలో మరోసారి ఏపీవో నిర్లక్ష్యంతో నర్సరీల్లో అనుకున్నమేరకు మొక్కల పెంపకం జరగడం లేదని గుర్తించారు. ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. వీటితో పాటు ఉపాధి పథకం నిర్వహణలో సైతం మాధవి ముఖ్యమైన రికార్డులను సమయానికి అందించక పోవడం కూడా తోడైంది. దీంతో డీఆర్డీఏ ఇన్‌చార్జి పీడీ సూర్యనారాయణ శుక్రవారం మాధవిని సస్పెండ్‌ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.

54
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles