కస్తూర్బా పాఠశాలను సందర్శించిన డీఈవో

Sat,June 15, 2019 02:40 AM

చిన్నగూడూరు జూన్‌14 : ప్రభుత్వ పాఠశాలల్లో వి ద్యార్థుల సంఖ్యను పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి సత్యప్రియ అన్నా రు. శుక్రవారం మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలను ఆమె సందర్శించా రు. పాఠశాలలో కల్పిస్తున్న వసతులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్‌, గ్రామస్తులు కస్తూర్బాగాంధీ పాఠశాలలో విద్యర్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి, పడక గదులు లేవని డీఈవోకు వివరించారు. వెంటనే మండల కేంద్రంలోని గిరిజన వసతి గృహంలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నందున కస్తూర్బా పాఠశాలను గిరిజన వసతి గృహంలోకి మార్చాలని విన్నవించారు. అనంతరం మండల కేంద్రంలోని గిరిజన వసతి గృహంతో పాటు, ప్రయివేటు భవనాలను వసతి గృహాల కోసం ఆమె పరిశీలించి మాట్లాడారు. కస్తూర్బా పాఠశాల సమస్యలను తక్షణమే పరిష్కరించి విద్యార్థులకు అన్ని వసతులతో కూడిన భవనాలను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల భవిష్యత్‌ కోసం ప్రభుత్వం అనేక వసతి గృహాలను ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ పిల్లి వీరయ్య, సర్పంచ్‌ కొమ్ము మల్లయ్య, ఎస్‌ఎంసీ చైర్మన్‌ దుంపల శ్రీనివాస్‌, గ్రామస్తుడు సత్యనారాయణ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles