విద్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

Sat,June 15, 2019 02:40 AM

-బడిఈడు పిల్లలను బడిలో చేర్చాలి
-బడిబాట కార్యక్రమలో ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌
మహబూబాబాద్‌, నమస్తే తెలంగాణ, జూన్‌ 14 : ప్రతి ఒక్కరూ చదువుకుంటే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని మహబూబాబాద్‌ ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ అన్నారు. మహబూబాబాద్‌ పట్టణంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల ఆధ్వర్యంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. వివేకానంద విగ్రహం నుంచి మదర్‌థెరిస్సా విగ్రహం వరకు విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యతోనే సమాజం అభివృద్ధి చెందుతుం దన్నారు. ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించాలని కోరారు. గత ప్రభుత్వాలు విద్యపై దృష్టి పెట్టక పోవడం వల్ల నిర్వీర్యమైందనిత తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కేసీఆర్‌ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల బలోపేతంతోపాటు రెసిడెన్షియల్‌, విద్యావిధానం తీసుకువ స్తుందన్నారు. మైనార్టీ గురుకుల విద్యాలయాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తుందని తెలిపారు. అంతేకాకుండా ఈ విద్యా సంవత్సరం నుంచి 119 గురుకుల పాఠశాలలను ప్రారంభించామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు 10/10 జీపీఏ సాధించడం గర్వించదగ్గ విషయమన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం ద్వారా వారికి అన్ని సౌకర్యాలను ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యను అందిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కళ్యాణి, ఎంఈవో కాంతారాం, వెంకటేశ్వర్లు, మందుల శ్రీరాం, ప్రభుత్వ బాలుర పాఠశాలల హెచ్‌ఎం. మురళి, ఉపాధ్యాయులు పద్మజ, శ్రీవాని, రమాదేవి, ప్రదీప్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్వాయి రాంమోహన్‌రెడ్డి, కేఎస్‌ఎన్‌రెడ్డి, ఎండీ ఫరీద్‌, నిమ్మల శ్రీను, సుదగాని మురళీగౌడ్‌, కాటబాస్కర్‌, దారా యాదగిరిరావు, గుండా పోతురాజు తదితరులు పాల్గొన్నారు.

47
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles