జిల్లాకు 4.33కోట్ల చేప పిల్లలు

Thu,June 13, 2019 02:09 AM

-1,076 చెరువుల్లో పోయడానికి ఏర్పాట్లు
-పూర్తి కావస్తున్న టెండర్ల ప్రక్రియ
మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఈ ఏడాది జిల్లాలో 4.33కోట్ల చేప పిల్లలను పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 1,076 చెరువులకు 100శాతం రాయితీపై చేప పిల్లలను పంపిణీ చేస్తున్నారు. 2016 సంవత్సరంలో 208 చెరువుల్లో 1.02కోట్ల చేప పిల్లలను పంపిణీ చేశారు. 2017లో 586 చెరువుల్లో 2.03కోట్ల చేప పిల్లలను పంపిణీ చేశారు. 2018లో 920 చెరువుల్లో 4.03 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేశారు. ఈ ఏడాది 4.33కోట్ల చేపపిల్లలను పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందుకోసం జిల్లాలో ఉన్న 16 మండలాల పరిధిలోని చెరువులు, కుంటలను గుర్తించారు. వర్షాలు సమృద్ధిగా పడి చెరువుల్లోకి 40-50శాతం నీరు చేరిన వెంటనే చేప పిల్లలను పంపిణీ చేసేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. చేపపిల్లలతో పాటు వాటికి కావాల్సిన సీడ్‌ను ఉచితంగా అందించేందుకు కూడా అందించనున్నారు.

చెరువుల్లోకి వచ్చిన నీటి సామర్థ్యాన్ని బట్టి ఎన్ని చేప పిల్లలు వేయాలనేది అధికారులు నిర్ణయిస్తారు. గత ప్రభుత్వాల హయాంలో మత్స్యకార్మిక సొసైటీలు తమ సొంత ఖర్చులతో చేపపిల్లలు, సీడ్‌ను కొనుగోలు చేసేవారు. చాలా సొసైటీలు ఆర్థిక ఇబ్బందుల వల్ల దళారీ వ్యవస్థను ఆశ్రయించేవారు. దీంతో దళారులు కొద్దిమొత్తంలో పెట్టుబడి పెట్టి లక్షల్లో లాభాలు ఆర్జించేవారు. ఈ విధానం వల్ల మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. ఇది గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 100శాతం రాయితీతో చేప పిల్లలను పంపిణీ చేస్తోంది. చెరువుల విస్తీర్ణాన్ని బట్టి ఒక హెక్టార్‌కు 2వేల చేప పిల్లలను పంపిణీ చేస్తారు. ఇప్పటివరకు 12మంది కాంట్రాక్టర్లు జిల్లాకు చేప పిల్లలను సరఫరా చేయడానికి ముందుకు వచ్చారు. టెండర్ల ఎంపిక ప్రక్రియను అధికారులు త్వరలో పూర్తి చేయనున్నారు. టెండర్ల ప్రక్రియ ముగిసిన తర్వాత సదరు కాంట్రాక్టర్ నుంచి అగ్రిమెంట్ తీసుకుంటారు. అనంతరం చెరువుల్లోకి నీళ్లు చేరగానే చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుంది. గత సంవత్సరం ప్రభుత్వం సమీకృత మత్స్య అభివృద్ధి పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా జిల్లాకు రూ.21.06 కోట్ల సబ్సిడిని కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా 3084 యూనిట్లను కేటాయించి పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 146 మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో 10,140మంది సభ్యులు ఉన్నారు.

మండలాల వారీగా ప్రణాళిక..
జిల్లాలో మొత్తం 1076 చెరువుల్లో చేప పిల్లల్ని పంపిణీ చే యడానికి జిల్లా మత్స్యశాఖ అధికారులు మండలాల వారీగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని చేప పిల్లలను పంపిణీ చేసేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. ఒక మండలంలో ఎన్ని చెరువులు ఉన్నాయి. వాటి విస్తీర్ణం ఎంత.. ఒక మండలానికి ఎన్ని చేప పిల్లలు అవసరం అనే వివరాలను ఇప్పటికే మత్సశాఖ అధికారులు సేకరించారు. వర్షాలు కురిసిన తర్వాత మండలాల వారీగా చేప పిల్లలను పంపిణీ చే సేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. జి ల్లాకు ఎన్ని చేపపిల్లలు అవసరమనే వివరాలను జిల్లా మత్స్యశాఖ అధికారు లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. జిల్లా నుంచి వెళ్లిన వివరాల ప్ర కారం.. జిల్లాకు 4.33కోట్ల చేప పిల్లల ను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం టెం డర్లను పిలిచింది. ఆ ప్రక్రియ కొనసాగుతుంది. కాంట్రాక్టర్లు అగ్రిమెంట్ చే సిన తర్వాత చెరువుల్లోకి నీళ్లు రాగానే చేప పిల్లల పంపిణీ ప్రారంభిస్తారు.

వచ్చే నెల నుంచి పంపిణీ..
జిల్లా వ్యాప్తంగా 16 మండలాల్లో చెరువులు, కుంటల వి స్తీ ర్ణం ప్రకారం.. చేప పిల్లల్ని పంపిణీ చేస్తారు. హెక్టారుకు చిన్న సైజు చేప పిల్లలు అయితే 3వేలు, పెద్ద సైజు చేప పిల్లలు 2వేల చొప్పున పంపిణీ చేస్తారు. గత ఏడాది బొచ్చే, రోహు, ఎర్రమో సు, రవ్వ, బొత్స తదితర రకాల చేప పిల్లలను పంపిణీ చేశారు. ప్రస్తుతం బంగారుతీగ చేప పిల్లలకు బాగా డిమాండ్ ఉంది. ప్ర భుత్వం ఈ ఏడాది 4.33కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయనున్నారు. ఇందులో 2కోట్లు బొచ్చే, 1కోటి రోహు, మరోకోటి బం గారుతీగ. మరో 33లక్షల రవ్వ చేప పిల్లలను పంపిణీ చేసేందు కు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. జిల్లాలో ఉన్న 1,0 76చెరువుల్లో 40-50శాతం నీళ్లు వచ్చిన వెంటనే చేప పిల్లల పంపిణీ ప్రారంభించనున్నారు. పంపిణీ పూర్తి అయ్యే వరకు క నీసం రెండు, మూడు నెలల సమయం పట్టే అవకాశముంది.

కొనసాగుతున్న టెండర్ల ప్రక్రియ..
జిల్లాకు రావాల్సిన 4.33కోట్ల చేప పిల్లల పంపిణీకి ఆన్‌లైన్‌లో టెండర్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి చేయడానికి 12మంది కాంట్రాక్టర్లు అర్హత పొందారు. టెండర్లకు సంబంధించి జిల్లా కలెక్టర్ సమక్షంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో జిల్లా సంయుక్త కలెక్టర్ చైర్మన్‌గా ఉంటారు. కన్వీనర్‌గా జిల్లా మత్సశాఖ అధికారి ఉంటారు. కమిటీ సభ్యులుగా పశు సంవర్థకశాఖ, వ్యవసాయశాఖ, జిల్లా సహకార శాఖ అధికారులు ఉంటారు. ఈ కమిటీ చేప పిల్లల పంపిణీని పర్యవేక్షిస్తుంది. అంతే కాకుండా సదరు కాంట్రాక్టర్లు తెచ్చే చేప పిల్లలు నాణ్యతగా ఉన్నాయా.. లేదా అనేది కూడ ఈ కమిటీ పరిశీలిస్తుంది. చేప పిల్లల నాణ్యతతో పాటు సైజు అగ్రిమెంట్ ప్రకారం ఉందా లేదా అని పరిశీలిస్తారు. చేప పిల్లల పంపిణీ మొత్తం పూర్తి అయ్యే వరకు జిల్లా వ్యాప్తంగా ఈ కమిటీ పర్యవేక్షణ చేస్తుంది. సొసైటీ సభ్యులు కూడా చేప పిల్లల నాణ్యతను పరిశీలించవచ్చు. ఉండాల్సిన దాని కంటే తక్కువ సైజులో చేప పిల్లలు ఉంటే చెరువుల్లో చేప పిల్లలను వేయక ముందే రిజక్ట్ చేసే అధికారం కూడా మత్సశాఖ సొసైటీలకు ఉంది.

పంపిణీకి ఏర్పాట్లు..
2016లో 208 చెరువుల్లో 1.02కోట్ల చేప పిల్లలను పంపిణీ చేశాం. 2017లో 586 చెరువుల్లో 2.03కోట్ల చేప పిల్లల్ని పంపిణీ చేశాం. 2018లో 920 చెరువుల్లో 4.03కోట్ల చేప పిల్లల్ని పంపిణీ చేశాం. ఈ ఏడాది 1,076 చెరువుల్లో 4.33కోట్ల చేప పిల్లలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే ఆన్‌లైన్ టెండర్ల ప్రక్రియ కొనసాగుతుంది. వచ్చే నెలలో వర్షాలు సమృద్ధిగా కురిస్తే జిల్లా వ్యాప్తంగా చేప పిల్లల పంపిణీ ప్రారంభించాలని అనుకుంటున్నాం. గత ఏడాది కంటే ఈ ఏడాది మరో 30లక్షల చేప పిల్లలను అదనంగా పంపిణీ చేయాలని నిర్ణయించాం. వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువుల్లో 40నుంచి 50శాతం నీళ్లు రాగానే చేప పిల్లల పంపిణీ ప్రారంభిస్తాం.

70
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles