పథకాలు నిరుపేదలకు వరం

Thu,June 13, 2019 02:07 AM

-డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్
-రెడ్యా, రవిచంద్ర దంపతులను సన్మానించిన ఎంపీపీ, జెడ్పీటీసీలు
చిన్నగూడూరు, జూన్ 12 : ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు నిరుపేదలకు వరంలా మారాయని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. బుధవారం మరిపెడ ఎంపీపీ గుగులోత్ అరుణ రాంబాబు, జెడ్పీటీసీ శారద రవీందర్ మండలంలోని ఉగ్గంపల్లిలో ఎమ్మెల్యే రెడ్యా-లక్ష్మి, టీఆర్‌ఎస్ యువ నాయకుడు రవిచంద్ర-నిత్య దంపతులను మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా రెడ్యా వారిని అభినందించి మాట్లాడారు. కల్యాణలక్ష్మి, వృద్ధులు, వికలాంగులు, వివిధ వర్గాల పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా, మిషన్ భగీరథ లాంటి బృహత్తర పథకాలతో రాష్ర్టాన్ని అభివృద్ధిలో దేశంలోనే అగ్రభాగాన నిలిపిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. గ్రామాలు, గిరిజన తండాలకు పక్కారోడ్ల సౌకర్యం, ఇంటింటికీ శుద్ది చేసిన తాగునీరందించే లక్ష్యంతో పని చేస్తూ డోర్నకల్‌ను ఆదర్శ నియోజకవర్గంగా నిలపడమే తన ముందున్న లక్ష్యమన్నారు. ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ప్రజలకు అందుబాటులో ఉంటూ, అభివృద్ధిలో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.

60
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles