రైతుల వివరాలు నమోదు చేయాలి

Thu,June 13, 2019 02:06 AM

మహబూబాబాద్, నమస్తే తెలంగాణ, జూన్ 12 : రైతుబంధు పథకం ద్వారా లబ్ధిపొందేందుకు ఇటీవల కొత్త పాస్ పుస్తకాలు పొందిన రైతుల వివరాలు నమోదు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి చత్రునాయక్ అన్నారు. బుధవారం మహబూబాబాద్ మండలంలోని సహాయ వ్యవసాయ సంచాలకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చత్రునాయక్ మాట్లాడారు. మండలంలో నిర్వహిస్తు న్న క్రాప్‌కాలనీల సర్వే వివరాలను తెలుసుకుని వాటిని వెంట నే ఆన్‌లైన్ చేయాలని అన్నారు. పాస్ పుస్తకం పొందిన ప్రతీ రైతు రైతు బీమా కోసం మండల ఏఈవోల దగ్గర ఆన్‌లైన్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఏవో లక్ష్మీనారాయణ, తిరుపతిరెడ్డి, సాయికుమార్, ప్రకాశ్, శ్రీనివాస్, పూజిత తదితరులు పాల్గొన్నారు.

72
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles