దైవ మార్గంలో నడిస్తే అభివృద్ధి సాధించవచ్చు

Thu,June 13, 2019 02:06 AM

-ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్
-రామాలయంలో లక్ష్మీగణపతి విగ్రహ ప్రతిష్ఠ
మహబూబాబాద్, నమస్తే తెలంగాణ, జూన్ 12 : దైవ మార్గంలో నడిస్తే అభివృద్ధి సాధించవచ్చని ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. బుధవారం రామాలయంలో లక్ష్మీగణపతి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని పూజలు నిర్వహించారు. పూజారి గుడి రాధాకృష్ణమూర్తి వేదమంత్రాల నడుమ విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతీ మనిషి దైవానుసారంగా శాంతియుతంగా జీవన వి ధానాన్ని అలవర్చుకుంటే దేశ అభివృద్ధి సాధించవచ్చని అన్నా రు. దేశం బాగుంటే మనుషులు బాగుంటారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను ఆశీర్వదించి పాడిపంటలు సంవృద్ధిగా పండాలని కోరుకుంటున్నామన్నారు. ప్రజలంతా శాంతి సౌభాగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పూజారు లు ఉమామహేశ్వరశర్మ, ఆలయ నిర్మాణ కమిటీ నారాయణలోయ, శ్రీరంగం వెంకటనర్సయ్య, వేమిశెట్టి చంద్రయ్య, ముఖ్య సలహాదారులు మార్నేని వెంకన్న, డాక్టర్ పాల్వాయి రాంమోహన్‌రెడ్డి, గుండా పోతురాజు, భక్తులు ఎస్‌వీ నాగేశ్వర్‌రావు, చౌడవరపు రంగయ్య, లూనావత్ అశోక్ పాల్గొన్నారు.

53
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles