ఎమ్మెల్యే రెడ్యాతోనే నియోజకవర్గ అభివృద్ధి

Thu,June 13, 2019 01:53 AM

-కొత్తగా ఎన్నికైన ఎంపీపీలు, జెడ్పీటీసీలుప్రజల మన్ననలను పొందేలా పని చేయాలి
-జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నవీన్
మరిపెడ, నమస్తేతెలంగాణ, జూన్ 12 : డోర్నకల్ ఎమ్మెల్యే ధరంసోతు రెడ్యానాయక్‌తోనే ఈ నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెడుతుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపుడి నవీన్ అన్నారు. నవీన్ దంపతులను మరిపెడ జెడ్పీటీసీ తేజవత్ శారద రవీందర్ నాయక్, ఎంపీపీ గుగులోత్ అరుణ రాంబాబు బీచ్‌రాజ్‌పల్లిలోని ఆయన ఇంట్లో బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. నిరంతరం తమ వెంట ఉండి సూచనలు, సలహాలు ఇస్తూ గెలుపు కోసం కృషి చేసినందుకు నవీన్ దంపతులకు ఎంపీపీ, జెడ్పీటీసీలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారికి కూడా నవీన్ శుభాకాంక్షలు తెలిపి అభినంధించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ చైర్మన్ వారిని ఉద్దేశించి మాట్లాడారు. మండల ప్రజలు మీపై ఎన్నో ఆశలు పెట్టుకుని భారీ మెజార్టీతో గెలిపించారని గుర్తు చేశారు. ప్రజల మన్ననలను పొందేలా పని చేయాలని సూచించారు. ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సాధక బాధకాలను పంచుకోవాలన్నారు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలన్నారు. ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఓ సామాన్య కార్యకర్త నుంచి మంత్రి వరకు ఎదిగారని గుర్తు చేశారు. ఆయన ఓర్పు, నేర్పరితనం రెడ్యా విజయ రహస్యమన్నారు. రెడ్యానాయక్‌ను ఆదర్శంగా తీసుకోని ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.

50
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles