జాయింట్ కలెక్టర్ డేవిడ్

Thu,June 13, 2019 01:52 AM

కేసముద్రం రూరల్, జూన్12 : అర్హులైన ప్రతీ రైతుకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేస్తాము జాయింట్ కలెక్టర్ డేవిడ్ అన్నారు. మంగళవారం మండలంలోని ఇనుగుర్తి గ్రామంలో జరిగిన భూరికార్డుల ప్రక్షాళన సభకు జేసీ హాజరై మాట్లాడారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మళ్లీ రెండో విడత భూ రికార్డుల ప్రక్షాళన సభలను గ్రామానికి ఒకరోజు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 10 నుంచి సభలు జరుగుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందజేసిన పట్టా పాస్ పుస్తకాల్లో ఉన్న తేడాలు, చేర్పులు, మార్పులపై రైతు లు ఈ సభకు వచ్చిన రెవున్యూ అధికారులకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. రైతుల సమస్యలను అధికారులు తెలుసుకుని వాటిని పరిష్కరించాలని అన్నారు. ఇనుగుర్తి గ్రామంలో ఇంకా 71 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాల్సి ఉందని, రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సురేశ్‌కుమార్, ఆర్‌ఐ బషీర్, వీఆర్వో భిక్షపతి, వీఆర్‌ఏలు పాల్గొన్నారు.

47
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles