సెలువులకు సెలవిక...

Wed,June 12, 2019 02:07 AM

-నేటి నుండి పాఠశాలలు పునఃప్రారంబం
-స్కూల్‌కు సకల సౌకర్యాలు స్వాగతం
-ప్రారంబంరోజునే పాఠ్య పుస్తకాల పంపిణీ
-పంపిణీకి సిద్దంగా ఏకరూప దుస్తువులు
-పెరిగిన కుకింగ్ కాస్ట్ అమలు
-ముందస్తుగా కుకింగ్ కాస్టు, వంటకార్మికుల గౌరవేతనాలకు రూ. 3 కోట్ల 76 లక్షల 51 వేలు విడుదల
-నేడు, రేపు సంస్థిద్దత కార్యక్రమాలు
-ప్రారంబం రోజున్నె ప్రతీ విద్యార్థి పాఠ్యపుస్తకాలు అందివ్వాలి : డిఈవో కె.ఎస్ సత్యప్రియ
నెల్లికుదురు, జూన్ 11 :సెలువులు ముగిశాయి...60 రోజుల పాటు ఆట,పాటలతో ఆనందంగా గడిపిన పిల్లలు వాటికి సెలవిచ్చి పాఠశాలలకు వెళ్లే వేళయింది. నేటి నుండి పాఠశాలలు పునఃప్రారంబం కానున్నాయి. సీమాంధ్ర పాలనలో సమస్యలు సరస్వతి నిలయాలకు స్వాగతం పలికేవి..దానికి స్వస్తి చెప్పి ప్రస్తూత తెలంగాణ సర్కారు నేటి బాలురే రేపటి నవభారత నిర్మాతలని భావించి విద్యా వ్యవస్థకు పెద్దపీఠ వేస్తు సకల సౌకర్యాలతో సర్కారు బడులకు స్వాగతం పలికే పరిస్థితులను కల్పించింది. ప్రారంబంరోజునే పాఠ్యపుస్తకాలు, ఏకరూప దస్తువులు అందించేందుకు వాటిని పాఠశాలల్లో సిద్దంగా ఉంచింది. సర్కారు బడుల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచేందుకు ఈ నెల 14 నుంచి 19 వరకు ప్రోఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంను నిర్వహించనున్నది. బడిబాట విజయవంతం చేస్తు విద్యార్థుల నమోదుశాతాన్ని పెంచడంతోపాటు విద్యార్థుల మౌళిక వసతులు తదితర వాటికై ఉన్నతాధికారులతో నేడు, రేపు సంసిద్దత కార్యాక్రమాలు నిర్వహించనున్నది. సంసిద్దత, బడిబాట కార్యక్రమంలో గ్రామా సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులను బాగసామ్యం చేస్తూ ప్రణాళిక సిద్దం చేశారు.

స్వరాష్ట్రం సిద్దించకముందు ఉమ్మడి రాష్ట్రంలో జూన్ 12న సమస్యలు సర్కారు బడులకు స్వాగతం చెబుతుండేవి. విద్యా సంవత్సరం సగం ముగిసేసరికి కూడా 100 శాతం పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తువులు విద్యార్థులకు అందకపోవడం, వర్షాలకు కురిసే స్కూల్ బిల్డింగ్‌లు, మరమ్మతులు లేని మరుగుదొడ్లు తదితర వాటితో విద్యార్థులు పడరాని పాట్లు పడుతు గత్యంతరంలేక తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులను భరిస్తు మరి తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపే పరిస్థితులు...కాని ప్రస్తూతం సర్కారు బడుల్లో కార్పోరేట్ స్థాయి విద్య, సౌకర్యాలను కల్పిస్తుండడంతో ప్రైవేటు వద్దు....సర్కారు బడులే ముద్దు సర్కారు బడుల్లో చేర్పించడానికే మొగ్గు చుపిస్తున్నారు. పాఠశాల ప్రారంబం రోజున్నె విద్యార్థులకు అందించేందుకు పాఠ్యపుస్తకాలు సిద్దంగా ఉన్నాయి. పాఠశాలల్లో మరుగుదొడ్ల, తాగునీటి తదితర సౌకర్యాలను సిద్దం చేసుంచారు. 14 నుంచి నిర్వహించే బడిబాటను విజయవంతం చేస్తు ఆ కార్యక్రమంలో ప్రతీ ఒక్కరిని బాగసామ్యం చేసేందుకు నేడు, రేపు సంసిద్దత కార్యక్రమాలను చేయనున్నారు.

నేటి నుండి పాఠశాలలు పునఃప్రారంబం
ఏప్రిల్ 13 నుండి ఇచ్చిన వేసవి సెలువు మంగళవారంతో ముగిశాయి. వాస్తవానికి విద్యా సంవత్సర క్యాలెండర్ ప్రకారం జూన్ 1 నుండి పాఠశాలలు పునఃప్రారంబంకావల్సి ఉండేవి. వేసవి ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో విద్యార్థులు ఆరోగ్యం దృష్ట్య జూన్ 12 నుండి పాఠశాలలు పునఃప్రారంబం చేయాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నది. ఈ నేపద్యంలో జిల్లా వ్యాప్తంగా 16 మండలాల్లో 773 ప్రాథమిక, 126 ప్రాథమికోన్నత, 106 ఉన్నత, 12 కేజీబీవీ, 11 ఆశ్రమ, 8 మోడల్, 4 గురుకులాలు, 8 సంక్షేమ గురుకులాలు, మదర్సా, 110 ప్రైవేటు మొత్తం 1220 పాఠశాలు ఉన్నాయి. సంబందిత పాఠశాలు నేటి నుండి పునః ప్రారంబంకానున్నాయి.

స్కూళ్లకు సకల సౌకర్యాలు స్వాగతం
నేటి నుండి ప్రారంబం కానున్న స్కూళ్లకు సకల సౌకర్యాలు స్వాగతం పలకనున్నాయి. వాటి కోసం సర్కారు ప్రత్యేక చర్యలు తీసుకున్నది. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా పాఠశాలల్లో అన్ని రకాల మౌళిక వసతులు కల్పించారు. ప్రతీ పాఠశాలలో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలను అందుబాటులో ఉంచారు. గతేడాది పలు పాఠశాలల్లో అసంపూర్తిగా నిలిచిపోయిన గదలు నిర్మాణం కోసం రూ. 53.03 లక్షలు, డ్యూయల్ డెస్క్‌ల కోసం రూ. 33.35 లక్షలు, నూతన అదనపు గదుల, వంటశాలల నిర్మాణానికి రూ. 17.75 లక్షలు మొత్తం 1.04 కోట్ల నిధులను వెచ్చిచింది. జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలల్లోని 182 మరుగుదొడ్ల నిర్మాణానికి రూ. 64.25 లక్షలు, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని 26 మరుగుదొడ్ల పునరుద్దరణకు రూ. 52 లక్షలు, 12 ఉన్నత పాఠశాలల్లోని 5 మరుగుదొడ్లకు రూ. 12.25 లక్షలు మొత్తం 1.28 కోట్లు వెచ్చింది. జిల్లాలలో మహబూబాబాద్ నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు రూ. 1.50 కోట్లు, పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు, పెద్దవంగర మండలాలకు మొత్తం 45.50 లక్షలతో ఆయా పాఠశాలల్లో త్రాగునీటి, రన్నింగ్ వాటర్, అదనపు గదుల నిర్మాణం చేపట్టారు ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా పలు పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పనకై గతేడాది మొత్తం 4.27 కోట్లు వ్యచ్చించింది. ప్రస్తూతం అన్ని పాఠశాలల్లో మౌళిక వసతులు అందుబాటులో ఉన్నాయి.

ప్రారంబంరోజునే పాఠ్య పుస్తకాల పంపిణీ
ప్రారంబంరోజున్నే ప్రతీ విద్యార్థికి పాఠ్యపుస్తకాలు అందించేందుకై అధికారులలు చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాలకు పాఠ్యపుస్తకాలు చేరుకున్నాయి. అక్కడి నుండి పాఠశాల ఫాయింట్‌కు చేరవేశారు. నేడు పాఠశాల పునఃప్రారంబంరోజున విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించేందుకు సిద్దం చేశారు.

అందుబాటులో ఏకరూప దుస్తువులు
ప్రభుత్వ పాఠశాలలో చదివి ప్రతీ విద్యార్థికి పాఠ్యపుస్తకాలతో పాటు ఏకరూపదుస్తువులను సర్కారు ప్రతీ ఏడు అందిస్తుంది. ఈ ఎడాది యూనిఫాం క్లాత్ ముందస్తుగానే అన్ని పాఠశాలలకు చేరాయి. పాఠశాలల నుండి ఆయా పాఠశాల హెచ్‌ఎంలు వాటిని కుట్టించడానికి టైలర్‌లను ఇచ్చారు. నేటి నుండి సంబందిత యూనిఫాంలను కూడా అందివ్వనున్నారు. గత రెండేళ్ల క్రితం 9, 10వ తరగతులు విద్యార్థులకు ఏకరూప దుస్తువులు అందించేవారు కాదు. ప్రస్తూతం వారికి కూడా గతేడాది నుండి యూనిఫాంను అందిస్తున్నారు. ఈ ఏడాదికి చెందిన క్లాత్ ముందస్తుగానే పాఠశాల ఫాయింట్‌కు పంపించారు.

పెరిగిన కుకింగ్ కాస్ట్ అమలు
మధ్యాహ్న భోజన పథకానికి ప్రభుత్వం ఈ ఏడాది నుండి మరింత బరోసా కల్పించేందుకై కుకింగ్ కస్ట్‌ను పెంచి ప్రస్తూత విద్యా సంవత్సరం నుండి అమలు చేస్తున్నది. గతంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థికొక్కంటికి రూ. 4.13, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల విద్యార్థికొక్కంటికి రూ. 6.18 అందించేవారు. పెరిగిన ధరలకు కనుగుణంగా వంటకార్మికులు ఇబ్బందులు పడొద్దనే ఉద్దెశ్యంతో ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల విద్యార్థికొక్కంటికి రోజుకు అందించే కుకింగ్ కాస్ట్‌ను రూ. 4.13 నుంచి రూ. 4.35 పైసలకు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల విద్యార్థికొక్కంటికి రోజుకి అందించే కుకింగ్ కాస్టుని రూ. 6.18 నుండి రూ. 6.51 పైసలకు పెంచింది. పెంచిన ధరలను ఏప్రిల్ నుండి అమలు చేస్తున్నది.

ముందస్తుగా కుకింగ్ కాస్టు, వంటకార్మికుల గౌరవేతనాలకు రూ. 3 కోట్ల 76 లక్షల 51 వేలు విడుదల
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో బాగంగా పాఠశాలలో పనిచేసే వంట కార్మికుల గౌరవ వేతనం, కుకింగ్ కాస్ట్‌కై పాఠశాలలు ప్రారంబంకాక ముందే ముందస్తుగా జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్న భోజనం అమలవుతున్న 960 పాఠశాలకుగాను మొదటి విడుతగా రూ. 3 కోట్ల 76 లక్షల 51 వేలు విడుదల చేసింది. సంబందిత నిధులు మండలాల వారిగా వారివారి డిడివో కోడ్‌లోకి డబ్బులు జమ అయ్యాయి. మరో 2 విడుతల్లో విద్యా సంవత్సరం ముగిసే సరికి అవసరమయ్యో నిధులన్నింటిని విడుదల చేస్తారు.

నేడు, రేపు సంసిద్దత కార్యాక్రమాలు
సర్కరు బడుల్లో విద్యార్థుల నమోదును పెంచేందుకై చేపడుతున్న ప్రోఫెసర్ జయశంకర్ బడిబాటను జయప్రదం చేయడానికై నేడు, రేపు సంసిద్దత కార్యాక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమాలు ఇవి.....
-జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని శాఖల ఉన్నత అధికారులతో బడిబాట సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి సంబందిత అధికారులు బడిబాటలో భాగస్వాములయ్యే చేసి బడిబాట కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో విజయవంతం అయ్యెటట్లు ప్రణాళికలు రూపొందించుకోవాలి.
- బడిబాట మొదటిరోజున జిల్లా మంత్రివర్యులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంధ సంస్థలను, ఉపాధ్యాయ సంఘాలను సంప్రదించి బడిబాట కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యె విధంగా రోజువారి కార్యక్రమాల్లో పాల్గొనెటట్లు ప్రణాళిక సిద్దం చేసుకోవాలి.
- బడిబాట మొదటిరోజున జిల్లా మంత్రివర్యులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు తమ తమ నియోజక వర్గంలో పాల్గొనెటట్లు ప్రణాళిక రూపొందించుకోవాలి.
- అవాస ప్రాంతాలన్ని కవర్ అయ్యె విధంగా బడిబాట కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేసుకోవాలి.
- పాఠశాల హెచ్‌ఎంలు, పాఠశాల యాజమాన్య కమిటీలు తక్షణమే సమావేశం ఏర్పాటు చేసుకుని 10వ తరగతి ఫలితాలు, విద్యార్థినీలకు ఉచితంగా పంపిణీ చేసిన హెల్‌తకిట్స్, మౌళిక వసతులు, మధ్యాహ్న భోజన పథకం, ఉచిత పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తువులు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు స్కాలర్‌షిప్ తదితర పాఠశాల యొక్క ప్రత్యేకతలను, సమాజ సహకరాం తదితర వివరాలతో పాఠశాల ప్రొఫైల్ తయారు చేసుకుని అట్టి వివరాల కరపత్రాలు, బ్యానర్లతో పాఠశాల అందరికి తెలిసే విధంగా ప్రచారం నిర్వహించడంతో పాటు బడిబాట ర్యాలీలను నిర్వహించడానికి ప్రణాళికను సిద్దం చేసుకోవాలి.
- దీర్ఘకాలికంగా పాఠశాలకు గైర్వాజరవుతున్న విద్యార్థులను స్వయం సహాయక గ్రూపులు, ఎస్‌ఎంసీల సహకారంతో పాఠశాలకు హాజరయ్యేలే ప్రణాళిక రూపొందించాలి.

82
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles