విద్యార్థులకు కసి ఉండాలి కసిగి తగ్గ కృషి ఉండాలి

Wed,June 12, 2019 02:05 AM

-కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి
-ప్రభుత్వ పాఠశాలల్లో 10/10 సాధించిన వారికి ప్రతిభా పురస్కారం
మహబూబాబాద్, నమస్తే తెలంగాణ, జూన్ 11ః
విద్యార్థులకు కసి ఉండాలని కసికి తగ్గ కృషి ఉండాలని కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి అన్నారు. మంగళవారం పీఆర్‌టీయు టీఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో 10/10 జీపీఏ సాధించిన విద్యార్థులకు, 100 శాతం రిజల్ట్ పొందిన పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రతిభ పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రతిభా పురస్కార సభకు ముఖ్య అతిథులుగా పీఆర్‌టీయు టీఎస్. రాష్ట్ర నాయకులు ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, హాజరైనారు. ఈ సందర్భంగా కూర రఘెత్తంరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ప్రతిభను సాదించడాన్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గర్వించదగిన విషయమాన్నారు. గ్రామీణ ప్రాంతాలల్లో తల్లిదండ్రులు కష్టపడి చదివించాలంటే కార్పోరేట్ పాఠశాలల్లో ఫీజులు కట్టలేక అప్పుల పాలు అవుతారని అన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులను గుర్తించి వారికి ఉన్న ఆశలను, ఆశాయాలను నిజం చేయాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యావిధానం అమలు అవుతుందని అన్నారు. పాఠశాలలకు అన్ని వసతులు కలిపిస్తూ కార్పోరేటుకు దీటుగా విద్యను అందిస్తుందని అన్నారు.

ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ హక్కుల కోసమే కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థుల కోసం, వారి భవిష్యత్తు కోసం పనిచేస్తారని అన్నారు. త్వరలో ఉపాధ్యాయుల సమస్యల సాధనకు రాష్ట్రస్థాయిలో టీటీజేఏసీని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరగాలంటే ఆంగ్లమాద్యమానికి అనుమతులు ఇవ్వాలని అన్నారు. దాంతో పాటు విద్యార్థుల ప్రవేశ వయస్సు మూడు సంవత్సరాలకు కుదించాలని కోరారు. పీఆర్‌టీయు టీఎస్ సంఘం ఉపాధ్యాయులు విద్యాబోధన పట్ల సముచిత న్యాయం చేసే విధంగా విద్యాబోదన చేస్తారని అన్నారు. పీఆర్‌టీయు సంఘం ఆధ్వర్యంలో 50 మంది విద్యార్థులను సన్మానించి ప్రతిభా పురస్కారం అందించడం వలన పిల్లలు ఇంక మంచి ప్రతిభ సాధించాలనే ఆకాంక్ష లభిస్తుందని అన్నారు. పిల్లల తల్లిదండ్రులకు మంచి ఉత్తేజంతో పిల్లలను ప్రోత్సహిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్‌టీయు రాష్ట్ర అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు మిరియాల సతీష్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సంకాబద్రినారాయణ, రేగూరి సుభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

59
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles