ప్రభుత్వ భవనాలకు భూముల పరిశీలన

Wed,June 12, 2019 02:05 AM

మహబూబాబాద్, నమస్తే తెలంగాణ, జూన్ 11:ప్రభుత్వ భవనాలు, అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు కేటాయించిన ప్రభుత్వ భూములను ఆయా శాఖలకు వెంటనే అప్పగించాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం కలెక్టర్, జాయింట్ కలెక్టర్ డేవిడ్ కలిసి మహబూబాబాద్ పట్టణంలోని సర్వే నెంబర్ 287లో గల భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణానికి 25 ఎకరాలు, జిల్లా కోర్టు ఏర్పాటుకు 15 ఎకరాలు, స్టేడియం నిర్మాణానికి 10 ఎకరాలు, వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు నిమిత్తం 27 ఎకరాలు ప్రభుత్వ భూమిని కేటాయించడం జరిగిందని తెలిపారు. ఆయా శాఖలకు కేటాయించిన భూములలో చెట్లను రాళ్లను తొలగించి చదును చేసి నాలుగు దిక్కులా ట్రెంచ్ కొట్టి వెంటనే ఆయా శాఖలకు అప్పగించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కొమురయ్య, ల్యాండ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ మూర్తి, స్థానిక తహశీల్దార్ బన్సీలాల్, సర్వేయర్లు తదితరులు ఉన్నారు.

45
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles