యోగపై అవగాహన కలిగి ఉండాలి

Wed,June 12, 2019 02:05 AM

మహబూబాబాద్, నమస్తే తెలంగాణ, జూన్ 11:యోగపై అవగాహన కలిగి ఉండాలని తనువు, మనసు, ఆత్మను ఏకం చేసే సాధనమే యోగ అని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వైద్యశాఖ, ఆయుష్ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యోగ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మానవ శరీరంలో స్వతంత్రంగా జరగాల్సిన ప్రక్రియలు జరుగక ప్రతిది మందులపై ఆధారపడి ఉండడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ పెరిగి మనిషి ఆరోగ్యం క్షిణించి పోతుందని అన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా యోగా చికిత్స ఉపయోగకరంగా ఉంటుందన్నారు. యోగా చేయడం యోగ సామాన్యులకు సైతం అందుబాటులో ఉండి సునాయసంగా యోగ ఆసనాలు చేయవచ్చని తెలిపారు. ప్రపంచంలోని 176 దేశాలు యోగాను గుర్తించి ఏకగ్రీవంగా ఆమోదించాయన్నారు. ఈ సందర్భంగా ఆయన గుర్తు చేస్తూ జూన్ 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకుంటున్నట్లు తెలిపారు. అధికారులు పని ఒత్తిడి నుండి ప్రశాంతత కొరకు ప్రణాళికా ప్రకారం క్రమం తప్పకుండా యోగ తరగతులను నిర్వహిస్తున్నట్లు ఈ తరగతులలో ప్రతి జిల్లా స్థాయి అధికారి పాల్గొనాలని కలెక్టర్ కోరారు. అదే విధంగా సంక్షేమ శాఖ, విద్యాశాఖ,. వైద్య ఆరోగ్యశాఖ, గ్రామీణాభివృద్ది సంస్థలోని కొందరు ఉద్యోగులను యోగాపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. శిక్షణ పొందిన తదుపరి ఆయా శాఖలలోని మండల స్థాయి, గ్రామస్థాయి ఉద్యోగులకు యోగ అభ్యాసంపై శిక్షణ కలిపించాలని కోరారు. అనంతరం నేచరోపతి డాక్టర్ ప్రేమ్‌సాగర్ ఆధ్వర్యంలో ముఖ్యమైన యోగసనాలు పై ప్రాక్టికల్స్ జిల్లా కలెక్టర్‌తో సహ అందరూ అధికారులతో యోగ చేయించి వాటి యొక్క ఉపయోగాలను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, డీఆర్‌డీఓ ఇంచార్జి సూర్యనారాయణ, సీపీఓ కొమురయ్య, జిల్లా వ్యవసాయ అధికారి చత్రునాయక్, అన్ని శాఖల జిల్లా అధికారులు, ఆయుష్ అధికారులు, మెడికల్ ఆఫీసర్లు, సీడీపీఓలు, డీఆర్‌డీఎ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles