నేడు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

Wed,June 12, 2019 02:04 AM

-పాల్గొననున్న ఎమ్మెల్యే రెడ్యానాయక్
కురవి(డోర్నకల్), జూన్ 11: డోర్నకల్ పట్టణ అభివృద్ధికి సీఎం కేసీఆర్ మంజూరి చేసిన 20కోట్ల నిధులలో అభివృద్ధిపనులకై బుధవారం డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ చేతులమీదుగా శంకుస్థాపనలు చేయనున్నట్లు టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గొర్ల సత్తిరెడ్డి, మండల అధికార ప్రతినిధి నున్న రమణలు తెలిపారు. డోర్నకల్ పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహా సర్కిల్‌లో నేడు జరగునున్న శంకుస్థాపనల ప్రదేశాలను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....డోర్నకల్ మున్సిపాలిటి పరిధిలో బుదవారం ఉదయం 9గంటల నుండి సాయంత్రం 5:30గంటల వరకు 20 పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిపారు. నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాంకుడోత్ వీరన్న, కేశబోయిన కోటిలింగం, అబ్ధూల్లా, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles