పసుపు ధర తగ్గిందని రైతుల ఆందోళన

Wed,June 12, 2019 02:04 AM

కేసముద్రంటౌన్,జూన్10: పసుపు ధర తగ్గిందని రైతులు మంగళవారం మార్కెట్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. మార్కెట్‌కి 5వేల బస్తాల పసుపు విక్రయానికి రాగా కాడి రకం క్వింటాల్ పసుపు గరిష్టంగా రూ. 6138 కనిష్టంగా 4209 , గోళ రకం పసుపుకి క్వింటాల్‌కి గరిష్టంగా రూ. 6251 , కనిష్టంగా 3889 ధర పలికింది. అయితే ధర తగ్గిందని ఆగ్రహించిన రైతులు మార్కెట్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. అధికారులు ఆందోళన చేస్తున్న రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యాపారులు కావాలనే ధరలు తక్కువ చేస్తున్నారని, ఏదో ఒక్క రాశికి ఎక్కువ ధర కేటాయించి మిగిలిన రాశులకు తక్కువ ధరలు కేటాయిస్తున్నారని రైతులు అధికారలకు పిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అధికారులు క్వింటాల్‌కి రూ.5వేల కంటే తక్కువ ధర పలికిన రాశులకు మరల టెండర్ వేయిస్తామని తెలుపడంతో రైతులు శాంతించారు.

56
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles