దుమ్మురేగుతోంది...

Wed,June 12, 2019 02:03 AM

-తొర్రూరు ప్రధాన రహదారిపై ఎర్రమట్టి దూళి
-అవస్థలు పడుతున్న జనం
తొర్రూరు, నమస్తే తెలంగాణ, జూన్ 11:తొర్రూరు పట్టణ సుందరీకరణ కోసం మున్సిపాలిటీ అధికారులు వేగవంతంగా అభివృద్ధి పనులు చేస్తున్నారు. కాని ప్రాథమిక ప్రమాణాలను పట్టించుకోకపోవడంతో జనం నానా అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్-ఖమ్మం హైవేపై ఉన్న డివైడర్‌ను ఆధునీకరించి రహదారి సుందరీకరణ, పచ్చదనం పెంచడంలో భాగంగా మొక్కలు నాటేందుకు డివైడర్ల నడుమ ఎర్రమట్టి పోయిస్తున్నారు. ఈ మట్టి డివైడర్ పనులు జరుగుతున్నంత మేర రోడ్డుపై పోయడంతో భారీ వాహనాలు వెళ్తుండగా లేస్తున్న ధూళికి వ్యాపార వర్గాలు, ద్విచక్ర వాహనదారులు, పాదాచారులు, రోడ్డు వెంట ఉండే గృహాల వారు నానా ఇబ్బంది పడుతున్నారు. ధూళి కారణంగా కండ్లు, ముక్కు, గొంతు మండడం ఇంకా ఏ వ్యాధుల బారిన పడాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. రోడ్డు వెంట మట్టిపడగానే మున్సిపాలిటీ పారిశుద్ధ్య సిబ్బందితో శుభ్రం చేయించి ట్యాంకర్ ద్వారా ధూళి లేకుండా నీళ్లు కొట్టిస్తే కొంత మేర ఇబ్బందుల నుండి జనానికి ఉపశమనం దొరుకుతుందని ఈ దిశగా మున్సిపల్ కమిషనర్ తక్షణం ఉపశమన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

47
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles