అర్హులైన రైతులందరికి పట్టా పుస్తకాలు ఇస్తాం

Wed,June 12, 2019 02:03 AM

-తొర్రూరు ఆర్డీవో టీ.ఈశ్వరయ్య
భూ రికార్డుల ప్రక్షాళన సభలను సద్వినీయోగం చేసుకోవాలి
మరిపెడ, నమస్తేతెలంగాణ, జూన్ 11;అర్హులైన రైతులందరికి పట్టా పాస్ పుస్తకాలు అందిస్తామని తొర్రూరు ఆర్డీవో టీ.ఈశ్వరయ్య అన్నారు. మంగళవారం మరిపెడ మండలం ఆనేపురం గ్రామంలోని రెండో విడత భూ రికార్డుల ప్రక్షాళన సభకు ఆర్డీవో హాజరయ్యారు. ఈ సందర్బంగా రైతుల నుంచి ఫిర్యాదులను తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం మళ్లీ రెండో విడత భూ రికార్డుల ప్రక్షాళన సభలను గ్రామానికి ఒక్క రోజు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 10వ తేది నుంచి జరుపుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వం అందచేసిన పట్టా పాస్ పుస్తకాల్లో ఉన్న తేడాలను, చేర్పులు, మార్పులపై రైతులు ఈ సభకు వచ్చిన రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పట్టా పాస్ పుస్తకాలు అందని రైతులు తమ గోడును ఆర్డీవోకు వివరించారు. రెవెన్యూ సిబ్బందిపై ఆరోపణలతో కూడిన పలు ఫిర్యాదులు చేశారు. భూమి ఉన్న పట్టా పుస్తకం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి లేనోళ్లకు పట్టా బుక్‌లు ఇచ్చారని చెప్పారు. దీంతో ఆర్డీవో అన్ని విషయాలపై విచారణ జరిపి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. ఆర్డీవో వెంట స్థానిక తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఆర్‌ఐ నజీమొద్ధీన్, పంచాయతీ కార్యదర్శి కృష్ణవేణి, ఆనేపురం, ఎల్లంపేటస్టేజి, యలమంచలితండా జీపీ సర్పంచ్‌లు పాల్గొన్నారు.

55
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles