పున ప్రారంభం రోజే గురుకులానికి చేరుకోవాలి

Wed,June 12, 2019 02:03 AM

మరిపెడ ట్రైబల్ వెల్పేర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మల్లెల భాలస్వామి
మరిపెడ, నమస్తేతెలంగాణ, జూన్ 11:మరిపెడ ట్రైబల్ వెల్పేర్ గురుకుల పాఠశాల, కళాశాల బుధవారం పున ప్రారంభం అవుతున్నదని ఆ రోజే విద్యార్థులు సకాలంలో గురుకులానికి చేరుకోవాలని ప్రిన్సిపాల్ మల్లెల భాలస్వామి అన్నారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ రీజీయన్ సీవో బురాన్ ఆదేశానుసారం విద్యార్థులు జూన్ 12న గురుకుల పాఠశాలకు చేరుకోని సంబంధిత హౌస్ మాస్టర్లకు రిపోర్టు చేయాలన్నారు. ఒక్కటి, రెండు రోజులు అలస్యమైన ఆర్‌సీవో పర్మిషన్ తీసుకోని రావాల్సి ఉంటదన్నారు. వారం దాటుతే గురుకుల సెక్రటరీ అనుమతి పొందితనే చేర్చుకోవడం జరుగుతుందన్నారు. 10రోజుల వరకు రాని విద్యార్థుల పేర్లను తొలగించడం జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని విద్యార్థులు, వారి తల్లితండ్రులు గమనించి పిల్లలను పాఠశాల పున ప్రారంభం తొలి రోజే పంపాలన్నారు.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles