పాము కాటుతో మహిళా మృతి

Wed,June 12, 2019 02:02 AM

నెల్లికుదురు, జూన్ 11;ఆరుబయట నిద్రిస్తున్న క్రమంలో పాటు కాటుకు గురై మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని మేచరాజుపల్లిలో సోమవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన శోభనబోయిన గంగమ్మ(45) సోమవారం రాత్రి బోజనం చేసి ఆరుబయట నిద్రకు ఉపకరించింది. అర్థరాత్రి ఎదో కుట్టినట్లు అవడంతో నిద్రలేచి చేసేసరికి పాము వెళ్తుంది. గమనించిన స్థానికులు గ్రామంలోని వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లారు. అప్పటికే గంగమ్మ స్పృహ కోల్పొయింది. కొద్ది సేపటికే వాంతులు చేసుకుని ఒక్కసారిగా మృతి చెందింది. మృతురాలికి కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. గతంలో ఆమె భర్త సోమయ్య ప్రమాదవశాత్తు మృతి చెందడం, ఇప్పుడు ఆమె పాము కాటుతో మృతి చెందడంతో పలువురు కన్నీరుమున్నీరైయ్యారు.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles