15న అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Tue,June 11, 2019 02:08 AM

మరిపెడ, నమస్తేతెలంగాణ, జూన్ 10 : మరిపెడ పట్టణ అభివృద్ధి, సుందరీకరణ పనులకు డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఈ నెల 15న శంకుస్థాపన చేయనున్నారు. అందుకు ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ అధికారులను ఎమ్మెల్యే రెడ్యా ఆదేశించా రు. సోమవారం మరిపెడ మున్సిపల్ పట్టణ అభివృద్ధి పనులపై మున్సిపల్, మిషన్ భగీరథ అధికారులు, ఇంజినీర్లతో రెడ్యానాయక్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ మరిపెడ, డోర్నకల్ మున్సిపాలిటీల అభివృద్ధి కోసం రూ.40 కోట్లు మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. ఈ అభివృద్ధి పనులు ఆరు నెలల క్రితమే మొదలు కావాల్సి ఉండగా ఎన్నికల కోడ్ వల్ల ఆలస్యం జరిగిందన్నారు. ఈ నెల 15న రూ.20 కోట్లతో చేపడుతున్న మరిపెడ పట్టణాభివృద్ధి పనులకు శంకుస్థాపన ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను రెడ్యా కోరారు.

మరిపెడబంగ్లాలోని సెంట్రల్ లైటింగ్ సిస్టం ఆధునీకరణ, రోడ్డు డివైడర్ పనులు, పట్టణంతో పాటు మరిపెడ గ్రామం, శివారు తండాలు, పలు కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను ప్రారంభిస్తానన్నారు. ఆడిటోరియం, వైకుంఠధామం, తదితర పనులను మొదలు పెట్టాలని ఇంజినీర్లను ఆదేశించారు. అదేవిధంగా పట్టణంలోని తాగు నీటి సమస్యపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతీ వీధికి మిషన్ భగీరథ నీరు సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ సింగారపు కుమార్‌ను కోరారు. తేడా వస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రతీ వాడకు, కాలనీకి, తండాల్లో వీధి లైట్లు తప్పని సరి పెట్టాలన్నారు. సమీక్ష సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నవీన్, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డీఎస్ రవిచంద్ర, మున్సిపల్ ఈఈ రంజిత్, కమిషనర్ సింగారపు కుమార్, డీఈ శ్రీనివాస్, ఎన్‌హెచ్‌ఏ ఏఈ మధన్, మున్సిపల్ ఏఈ ఉపేందర్, మిషన్ భగీరథ ఏఈ రాకేశ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ ప్రదీప్, విష్ణు, సీనియర్ అసిస్టెంట్ టీ రామకృష్ణ, గుత్తేదారు నర్సింహారావు, మరిపెడ మాజీ సర్పంచ్ రాంలాల్, ఎంపీటీసీలు అంబరీష, వస్రాం, పట్టణ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, నాయకులు రాంబాబు, రవీందర్‌నాయక్ పాల్గొన్నారు.

65
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles