జిల్లా పరిషత్ చైర్మన్లతో నేడు సీఎం సమావేశం

Tue,June 11, 2019 02:06 AM

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్మన్లు, వైస్‌చైర్మన్లతో మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇప్పటికే 32 జిల్లాల జెడ్పీ చైర్మన్లు అందరూ రాజధానికి చేరుకున్నారు. మహబూ బాబాద్ జిల్లా చైర్ పర్సన్ ఆంగోతు బిందు, వైస్ చైర్మన్ నూకల వెంకటేశ్వర్‌రెడ్డి సైతం సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వెళ్లారు. ముందుగా ఉదయాన్నే పరిచయ కార్యక్రమం తర్వాత కొత్తగా చైర్మన్లుగా, వైస్ చర్మన్లగా ఎన్నికైన వారిని అభినందిస్తారు. కొత్తగా మా ర్పులు చేసిన పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కల్పించనున్నట్లు తెలుస్తోంది. అతే విధంగా గత ప్రభుత్వాల్లో ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు ఏ మాత్రం నిధులు లేకపోవడంతో పాటు, ప్రత్యేకంగా అధికారాలు కూడా ఇవ్వలేదు. అయితే ఈసారి మాత్రం కొత్త పంచాయతీ రాజ్ చట్టంలో తెచ్చిన మార్పుల ఆధారంగా ప్రత్యేక నిధులు కూడా కేటాయించే విషయంపై జిల్లా పరిషత్ పాలక వర్గాలకు దిశానిర్ధేశం చేయనున్నారు. వచ్చే 15వ ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చే నిధులను స్థానిక సంస్థలకు ఎలా కేటాయిస్తారనేది సిఎం వివరించనున్నట్లు సమాచారం.

ఇదే కాకుండా స్థానిక సంస్థల బలోపేతానికి రూ.600 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వం మరో రూ.600 కోట్లు కేటాయించనున్న పథకాన్ని సమర్థవంతంగా వినియోగించుకునే కార్యక్రమాన్ని కూడా చెప్పనున్నట్లు తెలిసింది. ఆదే విధంగా పల్లెల్లో ముఖ్యమైన అంశమైన ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా జిల్లా పరిషత్తే మానిటరింగ్ చేసేటట్లు కూడడా మార్పులు చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నడిచే అంగన్‌వాడీలు, పాఠశాలలు పూర్తిగా జిల్లా పరిషత్ చేతుల్లోనే ఉండేలా చూడనున్నట్లు తెలుస్తుంది. రూరల్ ప్రాంతాలకు సంబంధించిన అన్ని పనులు స్థానిక సంస్థల చేతుమీదుగానే నడిచే విధంగా చూడనున్నట్లు తెలిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నడిచే సీఎంతో ముఖాముఖి కార్యక్రమంలో అనేక అంశాలు తెరపైకి వచ్చే అవకాశాలున్నాయి. పల్లెల ప్రగతికి జిల్లా, మండల పరిషత్‌లు ఎలా పని చేయాలో కూలంకంశంగా సీఎం వివరించనున్నారు.గతంలో గెలిచిన ఎంపిటీసీలు, జెడ్పీటీసీలు నిధులు, విధులు లేక ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారు. ప్రభుత్వానికి వ్యవతిరేకంగా ఆందోళనలు కూడ చేశారు. అయితే సమైఖ్యాంధ్ర పాలనలో ఉన్న చట్టాలను మార్చే అవకాశాలు లేక క్రితం సారి గెలిచిన వారికి నిరాశే మిగిలింది. అయి తే ఈసారి కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు ప్రత్యేక నిధులు, విధులను నేడు సీఎం ప్రకటించే అవకాశాలుండడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. కాగా ఈ సమావేశం పూర్తిగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి కావడంతో ఇందులో మన పంచాయత్ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడ పాల్గొనే అవకాశం ఉంది.

48
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles