ప్రతీ గ్రామంలో బడిబాట

Tue,June 11, 2019 02:06 AM

మహబూబాబాద్, నమస్తే తెలంగాణ, జూన్ 10 : తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రతీ పాఠశాలలో చేపట్టాలని డీఈవో ఎస్. సత్యప్రియ అన్నారు. సోమవారం తన కార్యాలయంలో హెచ్‌ఎంలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతీ గ్రామంలో, పట్టణాల్లో బడిబాట ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న వసతులపై వివరించాల న్నారు. ఉచిత పుస్తకాలు, యూనిఫాం, ఘాస్, మధ్యాహ్న భోజనం, హరితహారం, ఇన్‌స్పైర్, బయోమెట్రిక్ అటెండెన్స్‌పై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం 10వ తరగతి ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించిన హెడ్మాస్టర్లను డీఈవో సన్మానించారు. కార్యక్రమంలో వివేకానంద, శ్రీరాములు, బుచ్చయ్య, శ్రీదేవి, కాంతారావు, జిల్లా సైన్స్ అధికారి బి. అప్పారావు పాల్గొన్నారు.

37
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles