మంత్రి ఎర్రబెల్లిని కలిసిన నేతలు

Tue,June 11, 2019 02:06 AM

తొర్రూరు, నమస్తే తెలంగాణ, జూన్ 10 : మండలంలోని చెర్లపాలెం, గోపాలగిరి గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ నాయకులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును సోమవారం మర్యాద పూర్వ కంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసినట్లు సర్పంచ్ సట్ల నాగలక్ష్మి డాక్టర్ సట్ల వెంకట్, టీఆర్‌ఎస్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా గోపాలగిరి సర్పంచ్ శ్రీనివాసరావు, గ్రామ ఇన్‌చార్జి బిజ్జాల అనిల్, ఉప సర్పంచ్ డీ శ్రీను, చెర్లపాలెం నూతన ఎంపీటీసీ ధర్మారపు కిరణ్, దయన్న వీర అభిమాని మహ్మద్ అమీజ్, మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అ లాగే ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టు చైర్ పర్సన్ ఉషాదయాక ర్‌రావును కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేసినట్లు చెప్పారు.

పెద్దవంగర మండల నాయకులు..
పెద్దవంగర : మండలంలోని బొమ్మకల్లు గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ నాయకులు హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో ఆయన నివాసంలో దయార్‌రావును మర్యాద పూర్వకంగా కలిశారు. దయాకర్‌రావును కలిసిన వారిలో పాలకుర్తి దేవస్థాన చైర్మన్ రామచంద్రయ్యశర్మ, బొమ్మకల్లు నూతన ఎంపీటీసీ బానోత్ రవీందర్, ఎంపీటీసీ వెంకట్రామయ్య, జిల్లా, మండల రైతు సమన్వయ సమితి సభ్యులు జాటోత్ నెహ్రునాయక్, సోమనర్సింహరెడ్డి, మాజీ సర్పంచ్ సాయిలు, తదితరులు ఉన్నారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles