అంతర్‌రాష్ట్ర స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..

Wed,May 22, 2019 02:22 AM

-రూ. 12 లక్షల విలువైన110 కిలోల గంజాయి స్వాధీనం
-పోలీసుల అదుపులో నలుగురు.. పరారీలో ఒకరు
-నిందితులంతా తూర్పుగోదావరి జిల్లావాసులు
-ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి

మహబూబాబాద్, నమస్తే తెలంగాణ, మే 21 గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న నలుగురు అంతరాష్ట్ర ము ఠా సభ్యులను మంగళవారం అరెస్టు చేసి రూ. 12 లక్షల విలువ గల 110 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రలోని టౌన్ పోలీసుస్టేషన్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ, ముంబాయిలకు గంజాయి తీసుకెళ్లి అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారని అన్నారు. కేసముద్రం మండల కేంద్రంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఐదుగురు వ్యక్తు లు అనుమానాస్పదంగా కనిపించార న్నారు. పోలీసులను చూసి పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నారని, వారిని విచారించినట్లు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా వైరవరం మండలం పాలకొండ గ్రామానికి చెందిన కొర్ర సాయి, రాజు, క్యాంప్ గ్రామానికి పంగి రమేశ్, కొర్ర తీనాథ్, మరిగల రమేశ్‌లను అరెస్టు చేయగా తూర్పుగోదావరి జిల్లా వైరవరం మండలం డొంకరాయి గ్రామానికి చెందిన రమేశ్ తప్పించుకున్నట్లు తెలిపారు.

వీరందరూ కూలి పనులు చేసుకొని జీవనం సాగించేవాన్నారు. డొంకరాయి గ్రామానికి చెందిన రమేశ్ కొంత కాలం నుంచి నలుగురితో కలిసి నర్సీపట్నం, విశాఖపట్నం, ఒరిస్సా ప్రాంతాల నుంచి గంజాయిని కిలో రూ.1000 చొప్పున 110 కిలోలు రూ.1 లక్ష 10 వేలకు కొన్నారన్నారు. కొంకరాయి నుంచి భద్రాచలం మీదుగా మహబూబాబాద్ చేరుకొని అక్కడి నుంచి కేసముద్రంకు ఆటోలో బయలుదేరారన్నారు. అంబేడ్కర్ సెంటర్ నుంచి రైల్లో ప్రయాణం చేసేందుకు వస్తుండగా పట్టుబడినట్లు తెలిపారు. వీరిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ గంజాయిని పట్టుకున్న కేసముద్రం సీఐ సతీశ్, మహబూబాబాద్ రూరల్ సీఐ వెంకట్త్న్రంలను అభినందించారు. ఈ విలేకరులు సమావేశంలో ఏఎస్పీ రావుల గిరిధర్, డీఎస్పీ నరేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

60
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles