సుపారి గ్యాంగ్‌ అరెస్టు

Tue,May 21, 2019 01:15 AM

కేసముద్రం రూరల్‌, మే20: భూ విషయంలో హత్యచేయడానికి పథకం పన్నిన సుపారీ గ్యాంగ్‌ను అరెస్టు చేసి, వారి నుంచి మూడు తుపాకులు, రూ.3లక్షల నగదు స్వాధీనం చేసుకున్న సంఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ గిరిధర్‌ వివరాలు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రానికి చెందిన సోడెం వెంకట్‌ అదే గ్రామానికి చెందిన శేషగిరిరావు మధ్య భూ తగాదా ఉంది. ఈ క్రమంలో వెంకట్‌ను మట్టుబెట్టి భూ తగాదాను పరిష్కరించుకోవాలని శేషగిరిరావు అదే గ్రామానికి చెందిన యుగేంధర్‌, రా జు, పిల్లి వెంకన్నలతో కలిసి పథకం పన్నా డు. ఈ పథకాన్ని పిల్లి వెంకన్న మిత్రుడైన మాజీ నక్సలైట్‌ షేక్‌ సహాయంతో అమలు చేయాలని నిర్ణయించుకుని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం ప్రకారం గత ఏడాది అక్టోబర్‌ నెలలో దారి కాచి సోడెం వెంకన్నను వేటకొడవలితో దాడిచేసి మెడ పై నరికారు. అయినప్పటికీ ఈదాడిలో వెం కట్‌ తప్పించుకున్నాడు. వారి పథకం విఫ లం కావడంతో మరోసారి పథకాన్ని అమ లు చేసేందుకు రూ.15 లక్షలను మాజీ నక్సలైట్‌ షేక్‌కు, పిల్లి వెంకన్నకు, రాజు, యుగేంధర్‌లు ఇచ్చే విధంగా ఒప్పందం ఖరారు చేసుకున్నారు.

పథకం అమలు చేసేందుకు కావాల్సిన ఆయుధాలు పిల్లి వెంకన్న సమాకుర్చడంతో రూ.3లక్షలు, 2 తుపాకులను తీసుకుని శేషగిరిరావు, యుగేంధర్‌లు కేసముద్రంలో ఉన్న మాజీ నక్సలైట్‌ వద్దకు చేరుకున్నారు. ఈ పథకం అమలుకు మరో ఇద్దరు రావలసి ఉంది. ఈ క్రమంలో ఆదివారం స్థానిక ఎస్సై సతీశ్‌కు ఊరిబయట ఓ చింతచెట్టు కింద కొ ంతమంది ఆయుధాలతో ఉన్నారనే అంది న విశ్వసనీయ సమాచారంతో పోలీసు సిబ్బందితో వెళ్లారు. వీరి రాకను గమనించిన వారు పారిపోతుండగా అందులో శేషగిరిరావు, యుగేంధర్‌లను అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి అయిన మాజీ నక్సలైట్‌ తుపాకిని వదిలి తప్పించుకుని పారిపోయాడు. పట్టుబడిన వారి వద్ద 3 తుపాకులు, రూ.3 లక్షల నగదు లభించాయని అడిషనల్‌ ఎస్పీ తెలిపారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించకుంటే సుపారీ గ్యాంగ్‌ సోడెం వెంకన్నను హతమార్చేవారని ఏఎస్పీ అన్నారు. తప్పించుకున్న మిగిలిన మాజీ నక్సలైట్‌, ఇతర సభ్యులను త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుపారీ గ్యాంగ్‌ను వలపన్ని పట్టుకున్న కేసముద్రం ఎస్సై సతీశ్‌, అతడికి సహకరించిన రూరల్‌ సీఐ వెంకట్త్న్రం, బయ్యారం సీఐ రమేశ్‌, టౌన్‌ ఎస్సై అరుణ్‌కుమార్‌, క్యాట్‌ పార్టీ, పోలీస్‌ సిబ్బంది కాశీరాం, కొమురయ్య, రవిలను ఏఎస్పీ అభినందించడంతో పాటుగా రివార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నరేశ్‌కుమార్‌ పాల్గొన్నారు.

63
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles