జోరుగా ధాన్యం సేకరణ

Sun,May 19, 2019 02:03 AM

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లా వ్యాప్తంగా 16 మండల కేంద్రాల్లో 77 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రాథమిక సహకార సంఘాల ఆధ్వర్యంలో 47 కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఐకేపీ ఆధ్వర్యంలో 22, గిరిజన కో-ఆపరేటివ్ సొసైటీల ఆధ్వర్యంలో 05 కేంద్రా లు, మెప్మా ఆధ్వర్యం లో 3 కేంద్రాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో మొత్తం 7లక్షల క్వింటా ళ్ల ధాన్యం వస్తుందని పౌరసరఫరాల సంస్థ అధికారులు అంచనా వేశారు. గ్రేడ్-ఏ రకం ధాన్యానికి రూ.1770, కామన్ రకానికి రూ.1750 మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించింది. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉండే ధాన్యాన్ని తరలించేందుకు వాహనాలను సమకూర్చారు. రైతులు హార్వెస్టర్ల ద్వారా వరి కోసిన వెంటనే ట్రాక్టర్ల ద్వారా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి ఆరబోస్తున్నారు. మరికొందరు రైతులు పొలాల వద్దే ధాన్యం ఆరబోసి తరలిస్తున్నారు.

ప్రభుత్వం నిర్ణయించిన మేర తేమశాతం వచ్చిన వెంటనే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేయించి, ఏ రోజుకారోజే ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నారు. జిల్లాను నాలుగు సెక్టార్లుగా విభజించి, కేంద్రాల నుంచి ధాన్యాన్ని మిల్లులకు తీసుకెళ్తున్నారు. ధాన్యం విక్రయించిన రైతుల నుంచి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు భూమి, ఆధార్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ పత్రా లు తీసుకొని ట్యాబ్‌లో నమోదు చేస్తున్నారు. వివరాలు ఆన్‌లైన్‌లో హైదరాబాద్‌లోని కమిషనర్ కార్యాలయానికి పంపి, అక్కడి నుంచి ఆన్‌లైన్ ద్వారా జిల్లా పౌరసరఫరాల సంస్థ కు చేరవేస్తున్నారు. కొనుగోలు కేంద్రా ల నుంచి వ చ్చిన వివరాలతో డీఎం అధికారులు సరిచూసుకొని ఓకే చేస్తున్నారు. కన్ఫర్మేషన్ కాగానే రైతుల ఖాతాల్లో 48 గంటల్లో డబ్బులు జమ చేస్తున్నారు. దళారులు ధాన్యం విక్రయించిన రైతులకు నెల నుంచి నలభై ఐదు రోజులకు ధాన్యం డబ్బులు చెల్లిస్తుండగా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రెండు రోజుల్లోనే డబ్బులు జమ అవుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

22ఐకేపీ కేంద్రాలు
జిల్లా వ్యాప్తంగా 16 మండలాల పరిధిలో మొత్తం 77 కొనుగోళ్లు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 4,49,442 క్వింటాళ్ల ధాన్యం సేకరించారు. 22 ఐకేపీ కేంద్రాల్లో 3375 మంది రైతులు 1,56,629.60 క్వింటాళ్ల ధాన్యం విక్రయించారు. 47 పీఏసీఎస్ కేంద్రాలలో 6,350 మంది రైతులు 2,63,043.60 క్వింటాళ్లు, జీసీసీ ద్వారా ఏర్పాటు చేసిన 5 కొనుగోలు కేంద్రాల్లో 194 మంది రైతులు 8,743.20 క్వింటాళ్లు, 3 మెప్మా కేంద్రాల ద్వారా 473 మంది రైతులు 21,025.60 క్వింటాళ్ల ధాన్యాన్ని విక్రయించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 77 కొనుగోలు కేంద్రాల ద్వారా 10,392మంది రైతుల నుంచి 4,49,442 క్వింటాళ్ల ధాన్యాన్ని అధికారులు కొన్నారు. జిల్లా వ్యాప్తంగా రైతుల నుంచి రూ.79.54 కోట్లు విలువైన ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ అధికారులు కొనుగోలు చేశారు. ఇందులో రూ. 59కోట్లు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతుల పేరిట ట్యాబ్‌లో నమోదు చేశారు. ఇందులో రూ.32కోట్లు ఇప్పటికే రైతుల బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి.

గత ఏడాది వానకాలంలో అత్యధికంగా రెండింతలు దాటి 10.50లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని అధికారులు సేకరించారు. ఈ ఏడాది ప్రస్తుత సీజన్‌లో 7లక్షల క్వింటాళ్ల ధాన్యం అంచనా వేశారు. ఇప్పటి వరకు ఇందులో 4.50 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. జిల్లాలో 2017 యాసంగి సీజన్‌లో 4.50లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని అధికారులు సేకరించారు. 2018సీజన్‌లో 5లక్షల క్వింటాళ్లు, ఈ ఏడాది జనవరిలో 10.50 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ అధికారులు కొనుగోలు చేశారు.

93
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles