నమస్తే తెలంగాణ కథనానికి స్పందన

Sun,May 19, 2019 02:02 AM

కేసముద్రం రూరల్, మే18 : మండలంలోని ఇనుగుర్తి దాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు నెలరోజుల నిరీక్షణ అనే కథనంపై నమస్తే తెలంగాణలో వచ్చిన శీర్షికకు స్పందించి శనివారం జేసీ డేవిడ్ సంబంధిత అధికారులతో పరిశీలనకు వచ్చారు. ఇనుగుర్తిలో కేసముద్రం సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు తెచ్చిన ధా న్యాన్ని కొనకుండా ఇబ్బందులు పెడుతున్న సంబంధిత సీఈవోపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చూస్తామని తెలిపారు. కేంద్రంలో పేరుకుపోయిన రైతులు తెచ్చిన ధాన్యాన్ని వెంటనే కాంటాలు పెట్టించి వారికి ఇబ్బంది కలుగకుండా చూడాలని, వారికి గన్నీ సంచులు సమయానికి అందించాలని ఆదేశించారు. ఎండలు తీవ్రంగా ఉన్నాయని రైతులు అమ్మకానికి తెచ్చిన ధాన్యాన్ని వెంటవెంటనే కాంటాలు పెట్టించి, విక్రయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకు వచ్చే రైతులు చెత్త చెదారం లేకుండా, తేమ శాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలని, తద్వారా ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరను పొందవచ్చని సూచించారు. ఎప్పటికప్పుడు రైతులు తెచ్చిన ధాన్యాన్ని కేంద్రంలో నిల్వ లేకుండా వాహనాల ద్వారా తరలించేలా చూడాలని అ న్నారు. ఇందుకు తహసీల్దార్ సహాయాన్ని తీసుకోవాలని సొసైటీ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కార్యక్రమంలో సివిల్ సప్లయ్ మేనేజర్ మ హేందర్, జిల్లా కో ఆపరేటీవ్ కమిటీ సహాయ అధికారి ఇందిర, తహసీల్దార్ సురేశ్‌కుమార్, ఆర్‌ఐ బషీర్,వీఆర్‌వో భిక్షపతి తదితరులు ఉన్నారు.

67
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles