బాధిత కుటుంబానికి చేయూత

Sun,May 19, 2019 02:01 AM

నెల్లికుదురు, మే 18: అక్రమంగా నిల్వచేసిన 25 క్వింటాళ్ల నల్లబెల్లం, 20 కిలోల పట్టిక, బైక్‌లను స్వాధీనం చేసుకుని, ఒక్కరిని అరెస్టు చేసిన ఘటన మండలంలోని హేమ్లాతండా గ్రామపంచాయతీ శివారు ఇస్రాతండాలో శనివారం చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై పెండ్యాల దేవేందర్ తెలిపిన వివరాల ప్రకారం తండాకు చెందిన బానోత్ శంకర్ తన పొలంలో 50 బస్తాల్లో నిల్వ చేసిన రూ. 1.26 లక్షల విలువ చేసే 25 క్వింటాళ్ల నల్లబెల్లం, 20 కిలోల పట్టికలను బైక్‌పై తరలించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో నల్లబెల్లం, పట్టికలను స్వాధీనం చేసుకుని, బైక్‌ను సీజ్ చేసినట్లు ఎస్సై తెలిపారు. బానోత్ శంకర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్సై తెలిపారు. నల్లబెల్లం, పట్టిక, గుడుంబా, అంబర్ ప్యాకెట్ల వ్యాపారాలు నిర్వహిస్తే కఠినమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ దాడుల్లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

దంతాలపల్లిలో..
మరిపెడ, నమస్తే తెలంగాణ: మండలంలోని పలు తండాల్లో గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు స్థానిక పోలీస్ అధికారులతో కలిసి శనివారం దాడులు నిర్వహించినట్లు తొర్రూరు ఎక్సైజ్ సీఐ లావణ్య సంధ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మండలంలోని తూర్పు తండ, దుబ్బతండ, పెద్దముప్పారంలలో నిర్వహించిన దాడుల్లో 200 కేజీల బెల్లం, 2 కేజీల పట్టికను సీజ్ చేశామన్నారు. 10 లీటర్ల గుడుంబా, 50 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసినట్లు ఆమె పేర్కొన్నారు. నలుగురిపై కేసులు నమోదు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్సై

గూడూరులో..
గూడూరు: మండలంలోని చిన్నఎల్లాపురం గ్రామ పంచాయతీ పరిధి లక్ష్మణ్‌తండా శివారులో ఎక్సైజ్, పోలీసుశాఖ ఆధ్వర్యంలో గుడుంబా స్థావరాలపై శనివారం దాడులు నిర్వహించినట్లు ఎక్సైజ్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ దాడుల్లో 8లీటర్ల గుడుంబాను, 6కిలోల నల్లబెల్లాన్ని సీజ్ చేసినట్లు, 2వందల లీటర్ల బెల్లపానకం ధ్వంసం చేసినట్లు సీఐ తెలిపారు. ఈ దాడుల్లో ఏఎస్సై శ్యాం, ఎక్సైజ్ సిబ్బంది బాబు,పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

68
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles