కౌంటింగ్ ఏర్పాట్లు పకడ్బందిగా నిర్వహించాలి

Sat,May 18, 2019 06:02 AM

ఈ నెల 27వ తేదీన నిర్వహించు జెడ్పీటిసి, ఎంపిటిసి కౌంటింగ్ పకడ్బంది ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ వి.నాగిరెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశీంచారు. శుక్రవారం ఆయన హైదారిబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి స్థానిక సంస్థల కౌంటింగ్ ఏర్పాట్లపై జిల్లాల వారీగా కలెక్టర్లతో సమీక్షించి కౌంటింగ్ ఏర్పాట్లు సజావుగా జరుగుటకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌంటింగ్ హల్లో 14 టేబుల్స్ ఏర్పాటు చేసుకోవాలని, దానికి సరిపడు పర్నిచర్ స్టేషనరీ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కౌంటిగ్కు అవసరమగు కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు మొదలగు సిబ్బందిని కలెక్టర్లు రాండమయిజేషన్ ద్వారా మండలాల వారీగా కేటాయించి వారికి శిక్షణ ఈ నెల 20వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. స్ట్రాంగ్‌రూమ్ వద్దనుండి బ్యాలెట్ బాక్సులు ఆయా మండల కౌంటింగ్ హాల్‌లకు క్రమ పద్దతిలో తీసుకోని వేళ్లుటకు గాను స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద బాద్యతల అధికారులను నియమించలని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘంచే జారీచేసిన నియమవళీని ప్రతి కౌంటింగ్ సిబ్బందికి అందజేసి, వాటిని పాటిస్తూ కౌంటింగ్ నిర్వహించాలన్నారు. ప్రతి ఎంపిటిసికు రెండు కౌంటింగ్ టేబుల్స్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 26నాటికి సంభందిత రిటర్నింగ్ అధికారి ఎంపిడివోలు టేబుల్‌ల వారీగా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలనీ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య మాట్లాడుతూ జిల్లాలోని రెండు రెవేన్యూ డివిజన్లు అయిన మహబూబాబాద్ రెవేన్యూ డివిజన్లూ సంబందించిన మండలాల ఓట్ల లెక్కింపు మహబూబాబాద్‌లోని ఫాతీమా హైస్కూల్లో, తోర్రూర్‌లోని ఆర్యభట్ట పాఠశాలలో తోర్రూర్ రెవేన్యూ డివిజన్లూ సంబందించిన మండలాల స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపు నిర్వహణకు అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్లో జిల్లా పరిషత్ లైజినింగ్ అధికారి రమాదేవి, జిల్లా పంచాయీతీ అధికారి రంగాచారి, ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి సూర్యనారాయణ, ఆర్‌డివోలు కోమురయ్య, ఈశ్వరయ్య తదితరులు పాల్గోన్నారు.


ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలి
- జిల్లా కలెక్టర్ శివలింగయ్య
మహబూబాబాద్ నమస్తే తెలంగాణ, మే 17 ః
ఈ నెల 23వ తేదీన నిర్వహించు మహబూబాబాద్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను త్వరితంగా పూర్తి చేయాలని మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య ఆదేశించారు. శుక్రవారం ఆయన రాష్ట్ర సాంఘిక సంక్షేమా గురుకుల పాఠశాలలో జరుగుతున్న ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను పరిశీలించి పకడ్బందిగా ఏర్పాట్లను చేయుటకు అధికారులకు పలు సూచనలు చేశారు. ఏడు అసెంభ్లీ సెగ్మెంట్లకు సంబందించిన కౌంటింగ్ హల్‌లో ఏర్పాటు చేసిన బారికేడ్లను ఫెన్సీంగ్‌ను పరిశీలించి కౌంటింగ్ సిబ్బందికి, కౌంటింగ్ ఏజెంట్లకు సరిపడు సీటింగ్, వేసవి దృష్ట్య ఫ్యాన్లు తదితర ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్లను లేఅవుట్ మ్యాప్ ప్రకారం వెంటనే పూర్తి చేయాల్సిందింగా ఆదేశించారు. అధికారులు, కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ ఏజెంట్స్‌లకు వేరు వేరు ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేయుటకు తగు చర్యలు తీసుకోవాలని స్థానిక ఆర్‌డివోను ఆదేశించారు. అన్ని ఏర్పిట్లు ఈ నెల 20లోగా పూర్తి కావాలిని ఆదేశించారు. అసెంభ్లీ సెగ్మెంట్లకు నియమించబడిన టైజనింగ్ అధికారులు ఆయా అసెంభ్లీ సెగ్మెంట్లలో కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా జరిగే విధంగా అన్ని విధాల ఏర్పాట్లు చూసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డేవిడ్, డిఎస్‌పి నరేష్‌కుమార్, ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి సూర్యనారయణ, ఆర్‌డిఓలు కోమురయ్య, ఈశ్వరయ్య ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల లైజనింగ్ నోడల్ అదికారులు స్థానిక తాసీల్దార్ తదితరులు పాల్గోన్నారు.

88
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles