ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పులు జరిగేలా చూడాలి

Sat,May 18, 2019 06:00 AM

- సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలి
- జిల్లా కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య
మహబూబాబాద్, నమస్తే తెలంగాణ, మే 17:
ప్రతీ కాన్పు ప్రభుత్వ ఆస్పత్రిలో సాధారణ ప్రసవాలు జరిగే విధంగా నిర్లక్ష్యాన్ని వీడి అంకిత భావంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సాధారణ ప్రసవాలు, 102, 104, 108 వాహనాలు అందిస్తున్న సేవలు, నాన్ కమ్యూనిబుల్ డిజీజెస్ మొదలగు అంశాలపై ఆరోగ్యసబ్ సెంటర్లు, పీహెచ్‌సీల వారీగా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గూడూరు సీహెచ్‌సీ పరిధిలో 12 సబ్ సెంటర్లు ఉండగా ఏప్రిల్ మాసంలో జరిగిన 37 కాన్పులన్నీ మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రిలో, ఇతర ప్రైవేటు ఆస్పత్రుల్లో జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గూడూరు సీహెచ్‌సీలో మెరుగైన సౌకర్యాలు కల్పించినా ప్రసవాలు ఇక్కడ జరగకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిగేలా ప్రోత్సహించాలన్నారు. ఏంపీహెచ్‌ఎస్‌లు, ఏఎన్‌ఎంలు నిర్లక్ష్యాన్ని వీడాలని సూచించారు. ప్రభుత్వ వైద్యులు, మెడికల్ ఆఫీసర్లు పోటీపడి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిగేలా కృషి చేయాలన్నారు. 102, అమ్మఒడి,104, 108 వాహనాలు అందిస్తున్న సేవలపై సమీక్షిస్తూ లక్ష్యాల మేరకు సాధించాలన్నారు. ఈ సమీక్షలో డీఎంహెచ్‌వో శ్రీరాం, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ భీంసాగర్, వెంకటరమణ, వెంకన్న, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

74
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles