పెద్దతండాలో ఆలయ ప్రతిష్టాపన మహోత్సవాలు

Sat,May 18, 2019 06:00 AM

-ముఖ్యఅతిధిగా హాజరైన ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్
కురవి, మే 17: కురవి మండలం గుండ్రాతిమడుగు పెద్దతండా గ్రామంలో శ్రీ వెంకట సీతారామ కృష్ణాంజనేయ స్వామి ఆలయం ప్రతిష్టాపన మహోత్సవాలు శుక్రవారం రెండవ రోజు కొనసాగాయి. ప్రతిష్టాపన పూజల్లో ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ హాజరై పూజలు నిర్వహించారు. ప్రతిష్టాపన పూజలతో పెద్దతండా ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతుంది. పూజలతో గ్రామంలో పండుగ వాతావారణం నెలకొంది. ప్రతి ఇంటినుండి మహిళలు పెద్దసంఖ్యలో హరుతులతో ఆలయానికి విచ్చేసి పూజల్లో పాల్గొన్నారు. ప్రధాన యజ్ఞాచార్యులు గోవర్థన్ రాఘవాచార్యులు ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్‌కు కంకణం కట్టి, యాగశాల వద్ద పూజలు నిర్వహించారు. జలాధివాసం కోసం నిర్మించిన ప్రత్యేక తొట్టిలో ఉన్న విగ్రహాలకు పూజలు నిర్వహించారు. కలియుగ దైవాలుగా చెప్పుకునే విష్ణుమూర్తికి సంబంధించి మూడు యుగాల అవతరాలను ఒకే ఆలయంలో ఉండడం విశేషంగా చెప్పవచ్చు అన్నారు. ఆలయ నిర్మాణ నిర్వహణ కర్త గుగులోత్ సరోజ వెంకన్న నాయక్ ఆలయంలో ప్రతిష్టించే విగ్రహాలతో పాటు ఉత్సవ మూర్తులను ఎమ్మెల్సీకి చూపించారు. 19వ తేదీన తప్పనిసరిగా రావాలని ఎమ్మెల్సీని ఆహ్వానించారు. పూజారులు తీర్థప్రసాదాలు అందచేశి, ఆశీర్వచనం తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుగులోత్ కిషన్‌నాయక్, పీఎసీఎస్ చైర్మన్ గార్లపాటి వెంకట్‌రెడ్డి, రాందాస్, గుగులోత్ ఇస్నానాయక్, కస్నానాయక్, దశరధ్ నాయక్, స్థల దాతలు సిరినాయక్, శంకర్, విజయ్, మురళీనాయక్, రాజన్‌నాయక్, నందూనాయక్, మన్యూ ప్యాట్నీ తదితరులు పాల్గొన్నారు.

73
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles