అటవీ ఉత్పత్తులకు ధరల పెంపు

Sat,May 18, 2019 06:00 AM

కొత్తగూడ, మే 17: తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ ఈ ఏడాది అటవీ ఉత్పత్తుల రేట్లను పెంచడం జరిగిందని గిరిజన ప్రాథమిక సహాకార డివిజన్‌మేనేజర్ దేవా తెలిపారు. తబ్సి జిరుగు బంక కేజీ రూ. 108, ఎండు ఉసిరి పప్పు కేజీ రూ. 45, విప్ప పువ్వు కేజీ రూ. 17, విప్ప పలుకు కేజీ రూ. 25, ముష్టి గింజలు కేజీ రూ. 45, చిల్ల గింజలు కేజీ రూ. 35, కరక్కాయాలు కేజీ రూ. 15, కానుగ గింజలు కేజీ రూ. 10, తేనె కేజీ రూ. 150, తేనె మైనం కేజీ రూ. 120, నరమామిడి చెక్క కేజీ రూ. 32, నల్లజీడి గింజలు కేజీ రూ. 12, చింతపండు (గింజతో) కేజీ రూ. 30, చింతపండు (గింజలేకుండా) కేజీ రూ. 70 చొప్పున చెల్లించడం జరుగుతుందన్నారు. ఈఅవకాశాన్ని అటవీ గిరిజన, గిరిజనేతరులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని ఏజెన్సీ మండలాల్లోని సేల్స్ డిపోల వద్ద అమ్మకాలు చేయాలని సూచించారు.

62
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles