19న చాంబర్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవం

Sat,May 18, 2019 06:00 AM


తొర్రూరు, నమస్తే తెలంగాణ, మే 17తొర్రూరు చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవాన్ని ఈ నెల 19న ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు చాంబర్ ఆఫ్ కామర్స్ ఫంక్షన్‌హాల్ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు అధ్యక్ష, కార్యదర్శులు బిజ్జాల శ్రీనివాస్, చీదర మహేశ్, కోశాధికారి బిజ్జాల హరిశంకర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ముఖ్య అతిథిగా, వరంగల్ నగర మేయర్ గుండ ప్రకాశ్, వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దిడ్డి కుమారస్వామి, ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్‌గుప్తా విశిష్ట అతిథులుగా, అతిథులుగా జడ్పీటీసీ జాటోతు కమలాకర్, ఎంపీపీ కర్నె సోమయ్య, డీఎస్పీ జి.మదన్‌లాల్, మున్సిపల్ కమిషనర్ గుండె బాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ రామిని శ్రీనివాస్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, సీఐ వి.చేరాలు, ఎస్సై సీహెచ్.నగేశ్ హాజరవుతున్నారని తెలిపారు. చాంబర్ తక్షణ పూర్వ అధ్యక్షుడు బిజ్జాల అనిల్‌కుమార్ సభాధ్యక్షతన కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి చాంబర్ సభ్యులు, వ్యాపారస్తులు, ఆహ్వానితులు సకాలంలో హాజరు కావాలని వారు కోరారు. ఈ సమావేశంలో సంఘ ఉపాధ్యక్షులు ఎ.నవీన్‌రెడ్డి, నూనె మోహన్‌రావు, బిజ్జాల అశోక్, ఆర్‌వీ ప్రసాద్, సంయుక్త కార్యదర్శులు ఎం.అశోక్, ఎం.వేణుగోపాల్, వి.రమేశ్, ఆర్గనైజింగ్ కార్యదర్శులు ఎ.దయాకర్, వి.రవీందర్‌రెడ్డి, ఆర్‌పీ కేవ్‌సింగ్ పాల్గొన్నారు.

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles