పట్టాదారు పాస్‌పుస్తకదారులకే రైతు పథకాలు వర్తిస్తాయి

Sat,May 18, 2019 06:00 AM

సాదాబైనామాలపై భూమిన్న రైతులకు పథకాలు వర్తించవని, సంబందిత భూమిని పట్టా చేయించుకోవాలని పట్టాదారు పాస్‌పుస్తకదారులకే రైతు బీమా, రైతుబందు పథకాలు వర్తిస్తాయి ప్రతీ ఒక్కరు పట్టా చేయించాలని తహసీల్దార్ అనిశెట్టి పున్నంచందర్ అన్నారు. రైతులు భూ సమస్యల పరిష్కారానికై జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా చేపట్టిన భూ సమస్యలపై దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో బాగంగా శుక్రవారం మండలంలోని రామాంజపురంలో గ్రామసభను నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామంలో 1-బి పట్టాదారుల పేర్లను చదివి వినిపించారు. గుంట భూమి ఉన్నప్పటికి పట్టా చేయించుకోవాలని, అప్పుడే ప్రభుత్వం నుండి వచ్చే పథకాలకు అర్హులవుతారన్నారు. ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటు కాస్తులో ఉన్న అర్హులైన వారికి పట్టాదారు పాస్‌పుస్తకాలివ్వడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. భూ సమస్యల పరిష్కారానికై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని రైతులను సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ మల్లయ్య, విఆర్‌వోలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

81
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles