అధిక బరువుతోనే రక్త పోటు

Sat,May 18, 2019 05:59 AM

అధిక బరువుతోనే రక్త పోటు ఏర్పడుతుందని మరిపెడ పీహెచ్‌సీ డాక్టర్లు రవినాయక్, అరుణాదేవి అన్నారు. శుక్రవారం ప్రపంచ రక్త పోటు దినోత్సవం సందర్బంగా మరిపెడ పీహెచ్‌సీలో పలువురికి బీపీ పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సంరద్బంగా రవినాయక్, అరుణాదేవి రోగులతో మాట్లాడారు. అధిక బరువు పెరిగిన వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. నిత్యం ప్రతి ఒక్కరు వ్యాయమం చేయాలని సూచించారు. అతిగా కొవ్వు పదార్థాలు, మితిమీరిన ఉప్పు తినకూడదన్నారు. యోగా, ధ్యానం చేయాలన్నారు. ఏలాంటి ఒత్తిడికి గురి కావొద్దని, ధూమపానం, మద్యం సేవించడం వల్ల రక్త పోటు వస్తదన్నారు. అధిక రక్త పోటు నివారణకు ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎం సరళ, శ్రీదేవి, స్టాఫ్ నర్సు నసీమా, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

47
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles