23న పార్లమెంట్‌ ఓట్ల లెక్కింపు

Fri,May 17, 2019 01:48 AM

-గురుకుల పాఠశాలల ఏర్పాట్లు పూర్తి
-ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు వేర్వేరుగా కౌంటింగ్‌
-ఏజెంట్లకు 700 పాస్‌ల జారీ..
మహబూబాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ స్టేడియం సమీపంలో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పార్లమెంట్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే కౌంటింగ్‌ కేంద్రంలోపల పనులన్నింటినీ అధికారులు పూర్తి చేశారు. స్ట్రాంగ్‌రూములు వేరుగా, లెక్కింపుకు వేరుగా గదులు కేటాయించారు. పార్లమెంట్‌ ఎన్నికలు ముగియగానే ఈవీఎంలను జిల్లా కేంద్రానికి తరలించి స్ట్రాంగ్‌ రూముల్లో భద్ర పరిచారు. గురుకుల పాఠశాల మొత్తం కేంద్ర బలగాల భద్రతావలయంలో ఉంది. పాఠశాల లోపలికి వెళ్లగానే కుడి భాగంలో ఇల్లందు, పినపాక నియోజకవర్గాలకు, వీటికి ఎదురుగా ఉన్న గదుల్లో డోర్నకల్‌, మహబూబాబాద్‌ నియోజకవర్గాలకు, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గానికి మరోచోట, ఇల్లందు, పినపాక నియోజకవర్గాలకు మొదటి అంతస్తులో కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేశారు.

కౌంటింగ్‌ కేంద్రాల లోపల ఫ్యాన్లు, లైట్లు, జాలీలు, వివిధ పార్టీల నుంచి వచ్చే ఏజెంట్లకు కుర్చీలు, బల్లలు ఏర్పాటు చేశారు. మహబూబాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్లను లెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా ఏ నియోజకవర్గం నుంచి వచ్చే నాయకులు, ఏజెంట్లకు వేర్వేరుగా ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా ఏ అసెంబ్లీ నియోజకవర్గానికి కేటాయించిన ఎన్నికల సిబ్బంది, పోలీసులు, అభ్యర్థులు, నాయకులు, ఏజెంట్లకు కౌంటింగ్‌ కేంద్రానికి వెళ్లేందుకు బారీకేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. గురుకుల పాఠశాల చుట్టు భారీ కాంపౌండ్‌తో పాటు లోపల విశాలమైన స్థలం ఉంది. వీటికి తోడు విద్యుత్‌, టాయిలెట్స్‌ అన్ని సదుపాయాలు ఉన్నాయి. భద్రతపరంగా కూడ ఎలాంటి సమస్యలు ఉండవు. ఈవీఎంలను భద్రపరచడంతో పాటు కౌంటింగ్‌కు ఈ పాఠశాలను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈనెల 23న పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇప్పటికే ఈవీఎంతో పాటు వీవీప్యాట్స్‌ను స్ట్రాంగ్‌ రూములలో భద్రపరిచారు. గతనెల 11న పార్లమెంట్‌ ఎన్నికలు పూర్తి అయిన విషయం తెలిసిందే. అదే రోజు రాత్రి జిల్లా కేంద్రంలోని గురుకుల పాఠశాలకు ములుగు, నర్సంపేట, మహబూబాబాద్‌, డోర్నకల్‌, ఇల్లందు, పినపాక, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలు తీసుకొచ్చి భద్రపరిచారు.


అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా
ఓట్ల లెక్కింపు ఈనెల 23న పార్లమెంట్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపుతో పాటు ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. మహబూబాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో డోర్నకల్‌, మహబూబాబాద్‌, నర్సంపేట, ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ఒక అసెంబ్లీకి 14టేబుళ్ల ద్వారా ఓట్ల లెక్కింపును ప్రారంభించనున్నారు. ఇందుకోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. గురుకుల పాఠశాలలో విద్యుత్‌తో పాటు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఏడు స్ట్రాంగ్‌ రూములలో ఈవీఎంలను భద్రపరిచారు. ఓట్ల లెక్కింపుకు మరో ఏడు గదులను సిద్ధం చేశారు. ఈ గదుల్లో జాలీలు, కుర్చీలు, ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు చేశారు. వివిధ పార్టీలకు చెందిన ఏజెంట్లు కూర్చునేందుకు కుర్చీలు, బల్లలు ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్‌ సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

64
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles