గుడుంబా స్థావరాలపై దాడులు

Fri,May 17, 2019 01:46 AM

మరిపెడ, నమస్తేతెలంగాణ, మే 16: గుడుంబా స్థావరాలపై తొర్రూరు ఎక్సైజ్‌, సివిల్‌ పోలీసులు గురువారం సాయంత్రం దాడులు నిర్వహించారు. మరిపెడ మండలంలోని తానంచర్ల, మూలమర్రితండా, అజ్మీరాతండా, కూన్యాతండా, గుండెపూడి, బుర్హన్‌పురంతండా తదితర గ్రామాలు, తండాల్లో దాడులు జరిపి 50లీటర్ల బెల్లం పానకం, 20 లీటర్ల గుడుంబాను ధ్వంసం చేశారు. 10మందిపై కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో తొర్రూరు ఎక్సైజ్‌ సీఐ లావణ్యసంధ్య, సివిల్‌ ఎస్సై ఎల్‌ పవన్‌కుమార్‌, ఎక్సైజ్‌ ఎస్సై వీరభద్రం, కుమారస్వామి, ఎక్సైజ్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles