వడదెబ్బకు ఇద్దరి మృతి

Fri,May 17, 2019 01:44 AM

గార్ల రూరల్‌ మే16 : వడదెబ్బకు వృద్ధుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని గుంపెళ్లగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... చుంచు బాలయ్య(75) ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం తన ఇంట్లో కన్ను మూశాడు. మృతుడికి ఇద్దరు కుమారులు,ఒక కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని ముల్కనూర్‌ సర్పంచ్‌ వట్టం జానకి రాణి ,జెడ్పీటీసీ ఎద్దు మాధవి పరామర్శించి, పూలమాల వేసి నివాళి అర్పించారు. మృతదేహాన్ని సందర్శించిన వారిలో ఎద్దు లక్ష్మణ్‌,రాజా,బాచీ,సందీప్‌, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు,గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

తాలపల్లిలో..మరిపెడ, నమస్తే తెలంగాణ: వడదెబ్బతో రైతు మృతి చెందిన సంఘటన దంతాలపల్లి మండలంలోని బీరిశెట్టి గూడెం శివారు పంతులు తండాలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం, తండాకు చెందిన గుగులోత్‌ భద్రు (55) రోజూలాగే బుధవారం కూడా పంటను పశువులు మేయకుండా కాపలాగా ఉన్నాడు. దీంతో వడదెబ్బకు గురై, సాయంత్రం ఇంటికి వచ్చాక తీవ్ర అస్వస్థతకు గురవడంతో వెంటనే అతడ్ని చికిత్స నిమిత్తం తొర్రూరులోని ఓ దవాఖానకు తరలిస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు.

48
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles