భూ సమస్యలను సత్వరమే పరిష్కరించుకోవాలి

Fri,May 17, 2019 01:43 AM

తహసీల్దార్లు కృష్ణ, రమేశ్‌బాబు గార్ల, మే 16: నేటికీ పరిష్కారానికి నోచుకోని భూ సమస్యలను అర్హులైన ప్రతి ఒక్క రైతు సత్వరమే పరిష్కరించుకోవాలని తహసీల్దార్‌ జీ కృష్ణ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతీ రైతుకు నూరుశాతం న్యాయం జరగాలనే లక్ష్యంతో ఈ నెల 7 నుంచి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూ సమస్యల సత్వర పరిష్కార వేదిక ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. భూ సమస్యల పరిష్కారంలో భాగంగా గురువారం మండల పరిధిలోని శేరిపురం రెవెన్యూ గ్రామానికి చెందిన 57 మంది రైతులు తమ భూముల సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. అందులో ఆరుగురు రైతుల సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించామని, మరో 53 మంది రైతుల సమస్యలు పరిష్కరించాల్సి ఉందన్నారు.

కాగా 16 మంది రైతులకు సంబంధించిన భూములు వివాదంలో ఉన్నాయని, మరో ఇద్దరు రైతులకు సంబంధించిన భూములు ఇనామ్‌ భూములుగా గుర్తించామని, 35 మంది రైతులు గిరిజనేతరులని తహసీల్దార్‌ తేల్చి చెప్పారు. నేడు ముల్కనూరు రెవెన్యూ గ్రామ పరిధిలోని రైతులు తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్‌ఐ సీహెచ్‌ నర్సింహరావు, వీఆర్‌వోలు, వీఆర్‌ఏలతో పాటు రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

తొర్రూరు రూరల్‌: భూ సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్‌ ఆదేశాల మేరకు చేపట్టిన ‘మీ భూమి-మీ పత్రాలు’ కార్యక్రమం కొనసాగుతుంది. తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన శిబిరంలో మండలంలోని చింతలపల్లి గ్రామ రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ రమేశ్‌బాబు మాట్లాడుతూ బుధ, గురువారాల్లో రైతుల నుంచి 90 దరఖాస్తులు వచ్చాయన్నారు. వాటిలో విరాసత్‌ 10, రిజిస్ట్రేషన్‌ 1, భూమి తేడాలకు సంబంధించి 5, సాదాబైనామ 74 దరఖాస్తులు రాగా, వాటిలో 35 దరఖాస్తులను వెంటనే పరిష్కరించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ భాస్కర్‌తో పాటు వీఆర్వోలు, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles