ఇద్దరు వీఆర్వోల సస్పెన్షన్‌

Fri,May 17, 2019 01:41 AM

-మునిగలవీడుల ఘటనలో ఒక్కరు....
-మండల కేంద్రం 294 సర్వే నెంబర్‌ ఘటనలో మరొకరు
-నమస్తే తెలంగాణ కథనానికి స్పందన
నెల్లికుదురు, మే 16 : నమస్తే తెలంగాణ దినతపత్రికలో వచ్చిన వేర్వేరు కథనాలకు స్పందించిన ఉన్నతాధికారులు ఇద్దరు వీఆర్వోలను సస్పెండ్‌ చేశారు. మండల కేంద్రానికి చెందిన సర్వే నెంబర్‌ 294లో మోఖపై ఉన్నది 13.19 ఎకరాల భూమికిగాను రెవెన్యూ అధికారులు కాగితాల్లో 21.20 ఎకరాలుగా నమోదు చేశారు. దీనిపై ఏప్రిల్‌ 27న నమస్తే తెలంగాణ పత్రికలో ‘ఉన్నది 13.19 ఎకరాలు....కాగితాల్లో 21.20 ఎకరాలు’ కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనందుకు నెల్లికుదురు వీఆర్వో అల్లాబాసుకు సెస్పెన్షన్‌ ఆర్డర్‌ ఇచ్చారు. అదే విధంగా మునిగలవీడు గ్రామానికి చెందిన ఇస్సంపల్లి యాకన్న విద్యుత్‌ ఘాతంతో మృతి చెందాడు. అతను బతికున్న రోజుల్లో తన సర్వే నెంబర్‌ 814లోని 0.26 ఎకరాల భూమిని పట్టాచేసే కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహించారు. దీంతో మృతుడి కుటుంబానికి ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా ద్వారా రావల్సిన రూ. 5 లక్షలు అందలేదు. దీనిపై ఈ నెల 3న నమస్తే తెలంగాణ ‘చిన్న నిర్లక్ష్యం భారీ మూల్యం’ కథనంను ప్రచురించింది. దీంతో జేసీ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టగా వీఆర్వో ముత్తయ్యను అధికారులు సస్పెండ్‌ చేశారు.

సస్పెన్షన్‌ ఆర్డర్లు అందజేత
అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనందుకు ఒక్కరు, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు మరొకరు మొత్తం ఇద్దరు వీఆర్వోలను కలెక్టర్‌ ఉత్తర్వుల మేరకు గురువారం సస్పెండ్‌ చేస్తూ వారికి సస్సెన్షన్‌ ఆర్డర్లు అందించినట్లు తహసీల్దార్‌ అనిశెట్టి పున్నంచందర్‌ తెలిపారు. తహసీల్‌ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలోని సర్వే నెంబర్‌ 294లో సర్వే ఉందని చెప్పి రైతులను మోఖపైకి రప్పించిన నెల్లికుదురు వీఆర్వో అల్లాబాసు ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా వరసగా 2 రోజులు విధులకు గైర్జారవడంపై సస్పెండ్‌ చేస్తున్నట్లు చెప్పారు. అదే విధంగా మునిగలవీడు గ్రామానికి చెందిన ఇస్సంపల్లి యాకన్నకు ఆ గ్రామంలో ఉన్న సర్వే నెంబర్‌ 814లోని 0.26 ఎకరాల భూమి పట్టాదారు పాస్‌ పుస్తకం జారీపై ఆ గ్రామ వీఆర్వో ముత్తయ్య విధులపై వహించిన నిర్లక్ష్యానికి కలెక్టర్‌ ఉత్తర్వుల ప్రకారం ఆయనని సస్పెండ్‌ చేస్తున్నట్లు ఆర్డర్స్‌ అందించినట్లు తెలిపారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles