జాన్‌ 1 వరకు పలు ప్యాసింజర్‌ రైళ్ల రద్దు పొడిగింపు..

Thu,May 16, 2019 01:45 AM

కాజీపేట, మే 15 : కాజీపేట రైల్వే జంక్షన్‌ నుంచి నడిచే అజ్నీ, మణుగూర్‌ ప్యాసింజర్‌ రైళ్ల రాకపోకల రద్దును నేటి నుంచి జూన్‌ 1 వరకు పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. మహారాష్ట్రలో జరుగుతున్న రైల్వే ఇంజినీరింగ్‌ పనుల కారణంగా కాజీపేట-అజ్నీ మధ్య నడిచే నాగపూర్‌ ప్యాసింజర్‌ రైలును మే 31 వరకు రద్దుపరిచారు. దీంతో పాటుగా కాజీపేట - భద్రాచలం రోడ్‌ మధ్య పలుచోట్ల జరుగుతున్న పనుల కారణంగా మణుగూర్‌- కాజీపేట మణుగూర్‌ ప్యాసింజర్‌ను ఈనెల 31 వరకు రద్దుపరుస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. విజయవాడ-భద్రాచలం రోడ్‌ మధ్య నడిచే ప్యాసింజర్‌ రైలును ఈనెల 31 వరకు భద్రాచలం రోడ్‌-డోర్నకల్‌ మధ్య రద్దు పరుస్తూ డోర్నకల్‌-విజయవాడ మధ్య నడిపిస్తున్నట్లు తెలిపారు. రైలు ప్రయాణికులు గమనించాలని అధికారులు కోరారు.

54
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles