జూన్‌ 10నుంచి టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షలు

Thu,May 16, 2019 01:43 AM

న్యూశాయంపేట,మే15: జూన్‌10 నుంచి 24వరకు పదోతరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు వరంగల్‌ అర్బన్‌ డీఈవో నారాయణరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యా హ్నం 12:15 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. మార్చి2019లో నిర్వహించిన పదో త రగతి పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు హాజరుకావాలని కోరారు. ఈ నెల 27వరకు పరీక్ష ఫీజులు ఆయా పాఠశాల హెచ్‌ఎంల వద్ద చెల్లించాలని సూ చించారు. మార్చిలో నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులు రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేసినట్లయితే అట్టి ఫలితాల కోసం ఎదురు చూడకుండా జూన్‌లో నిర్వహించే సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కావాలని డీఈవో ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles