స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద పటిష్టమైన భద్రత

Thu,May 16, 2019 01:42 AM

-ఎస్పీ కోటిరెడ్డితో కలిసి పరిశీలించిన కలెక్టర్‌ శివలింగయ్య
మహబూబాబాద్‌.నమస్తే తెలంగాణ, మే15: పార్లమెంట్‌ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలు భద్రపర్చిన స్టాంగ్‌రూమ్‌ల వద్ద,కౌంటింగ్‌ కేంద్రాల వద్ద నాలుగు వందల మంది పోలీసు సిబ్బందితో భారీ భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ సంద్యాల కోటిరెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టర్‌ సీహెచ్‌ శివలింగయ్యతో కలిసి సోషల్‌వెల్‌ఫేర్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలో స్ట్రాంగ్‌ రూమ్‌లను, కౌంటింగ్‌ కేంద్రాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సవిల్‌ఫోర్స్‌,ఏఆర్‌ సిబ్బంది,కేంద్ర బలగాలు మొత్తం400 మందితో భద్రత ఏర్పాటు చేస్తున్నామన్నారు. కౌంటింగ్‌ కేంద్రం మ్యాప్‌ను పరిశీలించారు. భోజన వసతి, టాయిలెట్స్‌,ఇతరాత్ర ఏర్పాట్లు చూడాలని, దీంతోపాటు మీడియా పాయింట్‌ ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ డేవిడ్‌, డీఎస్పీలు నరేశ్‌ కుమార్‌,రేలా జనార్ధన్‌ రెడ్డి, టౌన్‌ సీఐ రవికుమార్‌,ఆర్‌ అడ్మిన్‌ నర్పయ్య, ఆర్డీవో కొమురయ్య,ఎమ్మార్వో బన్సీలాల్‌,మున్సిపల్‌ కమిషనర్‌ ఇంద్రసేనారెడ్డిలు పాల్గొన్నారు.

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles