ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్య

Thu,May 16, 2019 01:36 AM

తొర్రూరు రూరల్‌, మే 15 : ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ సంతోష్‌కుమార్‌ అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనే చేరాలని మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం ఆధ్యాపకులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్‌ కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలల్లో విద్య అందుతుందన్నారు. మీ సేవా కేంద్రాలతో సంబంధం లేకుండా ఉచితంగా కళాశాలల్లో దోస్త్‌ ఆన్‌లైన్‌ ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది సునీత, రోహిణి, వెంకన్న, రజిని, సోమేశ్వర్‌, కొండం అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

37
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles